- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గత 6 వారాల్లో ఇది 5వ హెలికాప్టర్ ప్రమాదం: ఖర్గే
by Ajay Maddhiboyina |
ఉత్తరాఖండ్ హెలికాప్టర్ ప్రమాదంపై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు ఖర్గే స్పందించారు. రుద్రప్రయాగ్‌లో జరిగిన ప్రమాద వార్త చాలా బాధాకరం అన్నారు.

X
దిశ, వెబ్ డెస్క్: ఉత్తరాఖండ్ హెలికాప్టర్ ప్రమాదంపై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు ఖర్గే స్పందించారు. రుద్రప్రయాగ్‌లో జరిగిన ప్రమాద వార్త చాలా బాధాకరం అన్నారు.పైలట్ సహా ఏడుగురు ప్రయాణికులు మరనించారని ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. ఇలాంటి బాధకర సమయంలో మృతుల కుటుంబాలకు దేవుడు బలాన్ని ప్రసాదించాలని కోరుకున్నారు. గత ఆరు వారాలలో ఇది 5వ హెలికాప్టర్ ప్రమాదం అని అన్నారు. ఈ ప్రమాదాలకు జవాబుదారీతనం ఎవరో నిర్దారించాలని డిమాండ్ చేశారు. వరుస ప్రమాదాలపై దర్యాప్తు చేసి సరైన భద్రతా ఏర్పాట్లు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు.
Next Story






