- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇండోనేషియాలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు?
ఇండోనేషియాలో భారీ భూకంపం (Indonesia Earth Quake) సంభవించింది.

X
దిశ, వెబ్‌డెస్క్: ఇండోనేషియాలో భారీ భూకంపం (Indonesia Earth Quake) సంభవించింది. తూర్పు ఇండోనేషియాలోని తనింబర్ ఐలాండ్స్ (Tanimbar Islands) ప్రాంతంలో భూమి కంపించగా.. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.9గా నమోదైనట్లు జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియో సైన్సెస్ (GFZ) తెలిపింది. భూమికి 10 కిలోమీటర్ల లోతులో భూకంపకేంద్రాన్ని గుర్తించారు. కాగా.. ఇప్పటి వరకూ ఎలాంటి సునామీ ముప్పు లేదని అధికారులు తెలిపారు.
2023 జనవరిలో తనింబర్ దీవుల్లో 7.6 తీవ్రతతో భూకంపం రాగా.. సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. తనింబర్ దీవులు మలుకు ప్రావిన్స్ పరిధిలో ఉన్న 30 ద్వీపాల సమూహం. పశ్చిమాన తైమూర్, తూర్పున న్యూ గినియా మధ్య అరాఫురా సముద్రంలో ఉన్నాయి.
Next Story






