- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
LPG కొరత...ఉపాధి కోల్పోనున్న ఫుడ్ డెలివరీ బాయ్స్ !
LPG కొరత ఉన్న నేపథ్యంలో స్విగ్గీ, జొమాటోలో పనిచేసే ఫుడ్ డెలివరీ బాయ్స్ ఉపాధి కూడా తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి.

దిశ, వెబ్ డెస్క్: భారతదేశ వ్యాప్తంగా LPG కొరత స్పష్టంగా కనిపిస్తున్న సంగతి తెలిసిందే. మిడిల్ ఈస్ట్ లో యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో LPG కొరత ఇండియాలో కనిపిస్తోంది. అయితే ఈ ఎల్పీజీ కొరత కారణంగా ఇండియాలోని చాలా రెస్టారెంట్లు ఇబ్బంది పడుతున్నాయి. ముంబైలోని దాదాపు 20 శాతం హోటల్స్, రెస్టారెంట్స్ ఇప్పటికే మూతపడ్డట్లు నివేదికలు చెబుతున్నాయి. బెంగళూరు, పూణే లాంటి నగరాలలో కూడా ఇదే పరిస్థితి నెలకొన్నట్లు చెబుతున్నారు. ఇంకా హైదరాబాద్ దాకా ఆ పరిస్థితి రాలేదు కానీ, మరికొన్ని రోజుల్లోనే వచ్చే ప్రమాదం కూడా ఉంది.
స్విగ్గీ, జొమాటో ఆర్డర్లపై ఎఫెక్ట్
ఇండియాలో LPG కొరత ఉన్న నేపథ్యంలో స్విగ్గీ, జొమాటోలో పనిచేసే ఫుడ్ డెలివరీ బాయ్స్ ఉపాధి కూడా తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. హోటల్స్, రెస్టారెంట్స్ మూతపడితే ఆటోమేటిక్ గా స్విగ్గీ, జొమాటో ఆర్డర్లు కూడా తగ్గిపోతాయి. దాని ద్వారా ఉపాధి పొందుతున్న డెలివరీ బాయ్స్ కు షాక్ తగిలే ప్రమాదం ఉంది. వాళ్ళ ఆదాయం అమాంతం తగ్గే ఛాన్స్ ఉంటుంది. అటు స్విగ్గీతో పాటు జొమాటో కు కూడా నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. అయితే ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం 10% ఎల్పీజీ ఉత్పత్తిని పెంచాలని నిర్ణయం తీసుకుంది.






