- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
LPG Gas Price(April 1) : తెలుగు రాష్ట్రాల్లో గ్యాస్ ధరలు
ప్రపంచవ్యాప్తంగా మారుతున్న భౌగోళిక-రాజకీయ పరిస్థితులు ఇంధన మార్కెట్లను కుదిపేస్తున్నాయి

దిశ వెబ్ డెస్క్ : ప్రపంచవ్యాప్తంగా మారుతున్న భౌగోళిక-రాజకీయ పరిస్థితులు ఇంధన మార్కెట్లను కుదిపేస్తున్నాయి. ముఖ్యంగా మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు నేపథ్యంలో క్రూడ్ ఆయిల్‌తో పాటు ఎల్పీజీ గ్యాస్ ధరలపై కూడా తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. గ్లోబల్ సరఫరా అంతరాయం, డిమాండ్ పెరుగుదల వంటి కారణాలతో గ్యాస్ ధరలు స్థిరంగా ఉండకపోవడం వినియోగదారుల్లో ఆందోళన కలిగిస్తోంది. గ్యాస్ సరఫరా, ధరలపై భవిష్యత్తులో మరింత ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం గృహ వినియోగ గ్యాస్ ధరలు స్థిరంగా ఉన్నప్పటికీ, వాణిజ్య సిలిండర్ల పెరుగుదల కారణంగా హోటళ్లు, చిన్న వ్యాపారాలపై భారం పెరుగుతోంది.ప్రస్తుతం హైదరాబాద్‌లో గృహ వినియోగ 14.2 కిలోల గ్యాస్ సిలిండర్ ధర సుమారు ₹965 వరకు ఉండగా , ఆంధ్రప్రదేశ్‌లో అమరావతి ప్రాంతంలో ₹937.50 వరకు నమోదైంది. విశాఖపట్నంలో సుమారు ₹861, విజయవాడలో ₹887 నుంచి ₹937 మధ్య ధరలు కొనసాగుతున్నాయి. కొన్ని జిల్లాల్లో ధరలు ₹1000 దాకా చేరుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరలు మాత్రం వరుసగా పెరుగుతున్నాయి. తాజాగా 19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధర దేశవ్యాప్తంగా రూ.195 వరకు పెరిగినట్లు సమాచారం. గత నాలుగు నెలల్లోనే సుమారు ₹500 పెరుగుదల నమోదైంది.






