- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రెండేళ్ల చిన్నారికి జీవిత ఖైదు.. అంత పెద్ద తప్పు ఏం చేశాడంటే..
నార్త్ కొరియాలో బైబిల్ కలిగి ఉండటం నేరంగా పరిగణించబడుతుంది. క్రైస్తవులపై మత హింసాత్మక చర్యలు వారసత్వాన్ని కలిపి శిక్షించబడేలా ఉంటాయి. క్రిస్టియన్స్‌కు ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన దేశంగా పరిగణించబడే ఉత్తర కొరియాలో దాదాపు

దిశ, వెబ్ డెస్క్ : నార్త్ కొరియాలో బైబిల్ కలిగి ఉండటం నేరంగా పరిగణించబడుతుంది. క్రైస్తవులపై మత హింసాత్మక చర్యలు వారసత్వాన్ని కలిపి శిక్షించబడేలా ఉంటాయి. క్రిస్టియన్స్‌కు ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన దేశంగా పరిగణించబడే ఉత్తర కొరియాలో దాదాపు లక్ష మంది క్రైస్తవులు జైళ్లలో మగ్గుతున్నారు. బైబిల్ కలిగి ఉన్న కారణంగా పబ్లిక్‌గా ఉరితీసిన ఘటనలు కూడా ఉన్నాయి. అయితే వారసత్వాన్ని ప్రభావితం చేసే శిక్షల కారణంగా ఓ రెండేళ్ల చిన్నారి కూడా ఎఫెక్ట్ కావడం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.
2023లో క్రైస్తవుల హింసాత్మక చర్యలను పరిశీలించే సంస్థ ఓపెన్ డోర్స్ సంస్థ నివేదిక ప్రకారం.. ఓ కుటుంబం 2022లో నార్త్ కొరియాలో అరెస్ట్ చేయబడగా.. కనీసం అసలు ఏం జరుగుతుందో తెలియలేని స్థితిలో ఉండే రెండేళ్ల చిన్నారి కూడా శిక్షను ఎదుర్కోవాల్సి వచ్చింది. నార్త్ కొరియా మూడు తరాల శిక్షా విధానం కింద ఈ శిక్షలో చేర్చబడటం చర్చకు దారితీసింది. ఆ చిన్నారి తల్లిదండ్రులు చైనా ఎక్స్‌పోర్ట్ చేసిన బైబిల్‌తో పట్టుబడినట్లు తెలుస్తుండగా.. చిన్నారితోసహా పేరెంట్స్‌ను జైలు క్యాంపుకు పంపించారు. అక్కడ బలవంతంగా పనులు చేయించడం, ఆకలి కేకలతో ఉండాల్సి వస్తుండగా.. అధిక మరణాల రేటు కలిగి ఉన్నట్లు తెలుస్తోంది.






