- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఉత్తర భారతీయులు తమిళం నేర్చుకోండి: డీఎంకే కనిమొళి
త్రిభాషా విధానంపై కేంద్రం, తమిళనాడు మధ్య వివాదం కొనసాగుతూనే ఉంది. ఇటీవల కేంద్ర హోం మంత్రి అమిత్ షా హిందీ ఏ భాషకు శత్రువు కాదని అన్నారు

దిశ, నేషనల్ బ్యూరో: త్రిభాషా విధానంపై కేంద్రం, తమిళనాడు మధ్య వివాదం కొనసాగుతూనే ఉంది. ఇటీవల కేంద్ర హోం మంత్రి అమిత్ షా హిందీ ఏ భాషకు శత్రువు కాదని అన్నారు. అన్నింటికీ మిత్రుడు లాంటిదని అన్నారు. దీనికి కౌంటర్ గా డీఎంకే ఎంపీ కనిమొళి స్పందించారు. తమిళం కూడా ఏ భాషకూ శత్రువు కాదు. ఉత్తర భారతీయులు కనీసం ఒక దక్షిణ భారతీయ భాష అయిన తమిళాన్ని నేర్చుకోవాలి. అప్పుడే నిజమైన జాతీయ ఐక్యతకు మార్గం అని తెలిపారు. మేము ఎవరి శత్రువులం కాదు. అందరికీ మిత్రులం. మా భాషను కూడా నేర్చుకోండి అని అమిత్ షాకు సూచించారు.
జాతీయ విద్యా విధానం..
కేంద్ర ప్రభుత్వం జాతీయ విద్యా విధానం (NEP) ద్వారా హిందీని బలవంతంగా రుద్దేందుకు ప్రయత్నిస్తోందని తమిళనాడు ఆరోపిస్తూ తీవ్రంగా విభేదిస్తోంది. మూడు భాషల విధానాన్ని నిరాకరించిన తమిళనాడుకు కేంద్రం విద్యా నిధులు కూడా తగ్గించిందని రాష్ట్రం మండిపడుతోంది. దీనికి సంబంధించి ఇటీవల అమిత్ షా మాట్లాడుతూ.. హిందీతో పాటు ఏ భారతీయ భాషకు వ్యతిరేకత ఉండకూడదని, భాషలను విభజన సాధనంగా ఉపయోగించిన గత ప్రయత్నాలు విఫలమయ్యాయని డీఎంకే నేతలను పరోక్షంగా విమర్శించారు. ఇటీవల ఆయన ఇంగ్లీష్ మాట్లాడేవారు త్వరలో సిగ్గుపడే రోజులు వస్తాయని వ్యాఖ్యానించడం కూడా చర్చకు దారి తీసింది.






