ప్రముఖ గాయని ఆశా భోస్లేకు గుండెపోటు.. ఆస్పత్రికి తరలింపు

by Vemula.Srinu Prasad |

భారతీయ లెజెండరీ సింగర్ ఆశా భోస్లే అస్వస్థతకు గురయ్యారు. శనివారం ఆమెకు అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు వెంటనే ముంబై బ్రీచ్ కాండీ ఆస్పత్రికి తరలించారు. ..

ప్రముఖ గాయని ఆశా భోస్లేకు గుండెపోటు.. ఆస్పత్రికి తరలింపు
X

దిశ, వెబ్ డెస్క్: భారతీయ లెజెండరీ సింగర్ ఆశా భోస్లే(Asha Bhosle) అస్వస్థతకు గురయ్యారు. శనివారం ఆమెకు అకస్మాత్తుగా గుండెపోటు(Heart Attack) రావడంతో కుటుంబ సభ్యులు వెంటనే ముంబై బ్రీచ్ కాండీ ఆస్పత్రి(Mumbai Breach Candy Hospital)కి తరలించారు. ప్రస్తుతం ఆమెను ఐసీయూ (ICU) వార్డులో ఉంచి వైద్యులు అత్యవసర చికిత్స అందిస్తున్నారు. 92 ఏళ్ల వయసున్న ఆమె ఆరోగ్య పరిస్థితిని వైద్య నిపుణులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.

దిగ్భ్రాంతికి గురైన చిత్ర పరిశ్రమ

ఆశా భోస్లే అస్వస్థత గురించి తెలుసుకున్న చిత్ర పరిశ్రమ ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురైంది. వేల సంఖ్యలో మధురమైన గీతాలను ఆలపించి కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఆమె త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియా వేదికగా సినీ ప్రముఖులు, అభిమానులు ప్రార్థించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు తెలుస్తున్నప్పటికీ ఆస్పత్రి వర్గాల నుంచి పూర్తి స్థాయి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Next Story