- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అమెరికాలో తాజా వీసా ప్రతిపాదన.. భారత విద్యార్థులకు షాక్
అమెరికాలో తాజా వీసా ప్రతిపాదన భారతీయుల విద్యార్థుల గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. గతంలో ఉన్న (current flexible system) ‘స్థిరమైన గడువు ’ ను తీసేసి (fixed duration for student visas) స్టూడెంట్ వీసాలకు పరిమితం చేయడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నాయకత్వంలో నిర్ణయం తీసుకునేందుకు రెడీ అయ్యారు.

దిశ, నేషనల్ బ్యూరో: అమెరికాలో తాజా వీసా ప్రతిపాదన భారతీయుల విద్యార్థుల గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. గతంలో ఉన్న (current flexible system) ‘స్థిరమైన గడువు ’ ను తీసేసి (fixed duration for student visas) స్టూడెంట్ వీసాలకు పరిమితం చేయడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నాయకత్వంలో నిర్ణయం తీసుకునేందుకు రెడీ అయ్యారు.ప్రస్తుతం అమల్లో ఉన్న, విద్యార్థులకు లాభదాయకంగా ఉన్న(Duration of Status) డ్యూరేషన్ స్టేటస్ వ్యవస్థను రద్దు చేసి, ప్రతి విదేశీ విద్యార్థికి ఒక కచ్చితమైన (exit date) తిరిగి బయలు దేరే టైంను కేటాయించే విధంగా ఈ ప్రతిపాదనను తీసుకొచ్చారు. వలసలను అరికట్టేందుకు ఇదో కఠిన చర్యగా పరిగణించబడుతున్న ఈ ప్రతిపాదన తో F-1 (విద్యార్థులు), J-1 ( సందర్శకులు) వీసాలపై ఉండే లక్షలాది మంది భారతీయులు ప్రభావితం అయ్యే అవకాశం ఉంది.
తిరిగి వెళ్లేందుకు కచ్చితమైన నిబంధనలు
2020లో ట్రంప్ తన మొదటి పదవీకాలంలో ఈ నియమాన్ని మొదట ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదన హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం (DHS) ద్వారా రూపొందించారు. ఇది విదేశీ విద్యార్థులు, మార్పిడి సందర్శకులు, విదేశీ మీడియా ప్రతినిధులపై కూడా చూపనుంది. ప్రస్తుతం అమల్లో ఉన్న విధానంలో విద్యార్థులు తమ విద్యా కార్యక్రమం కొనసాగుతున్నంత వరకు అమెరికాలో ఉండేందుకు అనుమతి కలిగి ఉంటారు. కొత్త ప్రతిపాదన ప్రకారం వారికి కచ్చితమైన తేదీని కేటాయించి ఆ తర్వాత దేశం విడిచి వెళ్లాలనే నిబంధన అమలులోకి వస్తుంది. ఈ నియమాన్ని సమీక్ష కోసం మేనేజ్‌మెంట్ అండ్ బడ్జెట్ కార్యాలయానికి సమర్పించారని సమాచారం. పబ్లిక్ ఒపినీయన్ కోసం 30–60 రోజుల గడువు ఉండే అవకాశం ఉన్నప్పటికీ ఈ నియమాన్ని తాత్కాలిక తుది నియమంగా అమలు చేసే అవకాశం కూడా ఉందని పేర్కొంటున్నారు.
వ్యతిరేకిస్తున్న ఉన్నత విద్యాసంస్థలు
ఈ మార్పును ఉన్నత విద్యా సంస్థలు తీవ్రంగా వ్యతిరేకించాయి. విద్యార్థుల చదువుకు ఇది తీవ్ర అంతరాయం కలిగించవచ్చని హెచ్చరిస్తున్నాయి. ప్రస్తుతం USలో ఉన్న 3.3 లక్షలకు మందికి పైగా విద్యార్థులపై దీని ప్రభావం పడనుండగా.. అత్యధికంగా ఎక్కువ మంది భారతీయ విద్యార్థులు ఉండనున్నారు. ఈ ప్రతిపాదన వల్ల తీవ్రంగా భారతీయ స్టూడెంట్స్ తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంది. మే 14న అమెరికా రాయబార కార్యాలయం భారతీయులకు హెచ్చరిక జారీ చేసింది. ‘మీరు అనుమతించిన సమయానికి మించి అమెరికాలో ఉంటే, బహిష్కరణ ఎదురవుతుంది. ఇకపై అమెరికా లోనికి ప్రవేశించలేరు అని వారు స్పష్టం చేశారు.
వీసాలను రద్దు చేసి..
ఇప్పటికే ఏప్రిల్ నెలలో ట్రంప్ ప్రభుత్వం విదేశీ విద్యార్థులపై కఠిన చర్యలు ప్రారంభించింది. చిన్న చిన్న తప్పిదాల పేరుతో చాలామంది విద్యార్థుల వీసాలను రద్దు చేసి, వారి SEVIS రికార్డులను మూసివేశారు. ఫలితంగా వారు అమెరికా విడిచి వెళ్లాల్సి వచ్చింది. అదనంగా ట్రంప్ అమెరికా విద్యా సంస్థలపై తనిఖీలు పెంచాలని, వాటి గుర్తింపు సంస్థలను మరింత సమీక్షించాలని ఆదేశించారు. ఆయన విద్యా సంస్థల్లో ఉదారవాద ప్రభావం పెరిగిపోతోందని ఆరోపిస్తున్నారు. క్యాంపస్‌లలో యూదు వ్యతిరేకతపై చర్యలు తీసుకోవడంలో జో బైడెన్ పాలనలో విఫలమయ్యారని ట్రంప్ మండిపడ్డారు. ఈ ప్రతిపాదనలు అమలవుతాయో లేదో అన్నది ఇంకా స్పష్టత లేనప్పటికీ అమలులోకి వస్తే మాత్రం భారతీయ విద్యార్థుల అమెరికా కలలు చెదిరిపోయే అవకాశాలు ఉన్నాయి.






