- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హైదరాబాద్‌ను మండిస్తాం, భారత్‌ను ముక్కలు చేస్తాం.. లష్కరే తోయిబా బహిరంగ హెచ్చరిక
భారత్‌ను విచ్చిన్నం చేస్తాం అంటూ ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా బహిరంగ హెచ్చరిక జారీ చేసింది. లష్కరే తోయిబా అక్ర కమాండర్ సయ్యద్ అబ్దుల్ రెహ్మాన్ నఖ్వీ కాశ్మీర్ సంఘీభావ దినోత్సవం పేరుతో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశాడు.

దిశ, వెబ్ డెస్క్: భారత్‌ను విచ్చిన్నం చేస్తాం అంటూ ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా బహిరంగ హెచ్చరిక జారీ చేసింది. లష్కరే తోయిబా అక్ర కమాండర్ సయ్యద్ అబ్దుల్ రెహ్మాన్ నఖ్వీ కాశ్మీర్ సంఘీభావ దినోత్సవం పేరుతో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశాడు. లాహోర్‌లో ఈ సభ జరగ్గా రాజకీయనాయకులు సైతం పాల్గొనడం ఆశ్చర్యకరం. భారత వ్యతిరేక శక్తులను పాక్ ఎలా పెంచిపోశిస్తుందో చెప్పడానికి ఇది నిదర్శనం. ఇక సభలో ఉగ్రనేత మాట్లాడుతూ.. ఢిల్లీ, ఆగ్రాలో దాడులు చేస్తామని కాశ్మీర్ ను విముక్తి చేస్తామని ప్రతిజ్ఞ కూడా చేశాడు.
అఖండ భారతదేశాన్ని ముక్కలు ముక్కలుగా విడగొడతామని అన్నాడు. ఆగ్రాను తగలబెడతామని హెచ్చరించాడు. దక్కన్ ను మండిస్తామని.. ఢిల్లీని కదిలిస్తామని హెచ్చరించాడు. 26/11 ముంబై ఉగ్రదాడిని గుర్తు చేస్తూ తమ పూర్వీకుల త్యాగాలు వృథా కాకూడదని అన్నాడు. ఇదిలా ఉంటే పాకిస్తాన్ మర్కాజీ ముస్లిం లీగ్ కు కూడా నాయకత్వం వహిస్తున్నాడు. అంతే కాకుండా భారత్ లో అనేక దాడులకు కారణమైన (ఎల్ఈటీ) వ్యవస్థాపకుడు, సూత్రధారి ఉగ్రవాది హఫీజ్ సయీద్ తో పాటు అతడి కుమారుడు హఫీజ్ తల్హా సయీద్‌కు సన్నిహితుడుగా తెలుస్తోంది.






