ఇజ్రాయెల్‌కు మద్దతిస్తే నామ రూపాలు లేకుండా చేస్తాం.. పాక్‌కు లష్కరే తొయిబా వార్నింగ్

by Ajay Maddhiboyina |

ఉగ్ర‌వాద సంస్థ లష్క‌రే తోయిబా పాకిస్థాన్‌కు వార్నింగ్ ఇచ్చింది. పాకిస్థాన్ సహా ముస్లిం దేశాలు ఇజ్రాయెల్‌కు మద్దతిస్తూ ఆ దేశంలో సంబంధాలను సాధారణీకరించుకోవాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన విజ్ఞ‌ప్తితో పాకిస్థాన్ అయోమ‌యంలో ప‌డింది.

ఇజ్రాయెల్‌కు మద్దతిస్తే నామ రూపాలు లేకుండా చేస్తాం.. పాక్‌కు లష్కరే తొయిబా వార్నింగ్
X

దిశ‌, వెబ్ డెస్క్: ఉగ్ర‌వాద సంస్థ లష్క‌రే తోయిబా పాకిస్థాన్‌కు వార్నింగ్ ఇచ్చింది. పాకిస్థాన్ సహా ముస్లిం దేశాలు ఇజ్రాయెల్‌కు మద్దతిస్తూ ఆ దేశంలో సంబంధాలను సాధారణీకరించుకోవాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన విజ్ఞ‌ప్తితో పాకిస్థాన్ అయోమ‌యంలో ప‌డింది. దీంతో ముందుగానే ఇజ్రాయెల్ కు మ‌ద్ద‌తు ఇవ్వొద్దంటూ ల‌ష్క‌ర్ ఏ తొయిబా చీఫ్ సైఫుల్లా క‌సూరి పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ కు, ప్ర‌ధాని షెహ‌బాజ్ కు బ‌హిరంగ హెచ్చ‌రిక చేశారు. ఇజ్రాయెల్ కు మ‌ద్ద‌తు ఇవ్వాల‌ని మాట్లాడినవాళ్లు ఎవ‌రైనా అంత‌మైపోతార‌ని అన్నారు.

ఇజ్రాయెల్ ను గుర్తించాల‌ని ముస్లిం దేశాల‌ను ఏ ప్ర‌పంచ శ‌క్తి కూడా బ‌ల‌వంతం చేయ‌లేద‌ని సైఫుల్లా వ్యాఖ్యానించారు. పాకిస్థాన్ సైనిక సామ‌ర్థ్యాలు ఇప్పుడు ఇజ్రాయెల్ తో పోల్చుకునే స్థాయికి చేరుకున్నాయ‌ని అన్నారు. ల‌ష్క‌ర్ ఈ తొయిబా హెచ్చ‌రిక‌తో పాకిస్థాన్ లో ఈ వ్య‌వ‌హారం హాట్ టాపిక్ గా మారింది. మ‌రోవైపు సైఫుల్లా మాట్లాడ‌క‌ముందే పాకిస్థాన్ ర‌క్ష‌ణ మంత్రి ఖ‌వాజా కూడా ఇజ్రాయెల్ కు మ‌ద్ద‌తు ఇవ్వ‌డానికి పాకిస్థాన్ సుముఖంగా లేద‌ని స్ప‌ష్టం చేశాడు. 1967 స‌రిహ‌ద్దుల ఆధారంగా తూర్పు జెరూస‌లెంను రాజ‌ధానిగా చేసుకుని స్వ‌తంత్ర పాల‌స్తీనా రాజ్యం ఏర్ప‌డేవ‌ర‌కు పాక్ ఇజ్రాయెల్ కు మ‌ద్ద‌తు ఇవ్వ‌ద‌న్నారు. ఆ దేశంతో ఏ ఒప్పందం అయినా త‌మ దేశ భావ‌జాలానికి వ్య‌తిరేకం అని స్ప‌ష్టం చేశారు.

Next Story