పహల్గామ్ తరహాలో మరో దాడి.. లష్కరే తోయిబా వార్నింగ్

by Ajay Maddhiboyina |

ల‌ష్క‌రే తోయిబా డిప్యూటీ చీఫ్, ప‌హ‌ల్గామ్ దాడి సూత్ర‌దారి సైఫుల్లా క‌సూరి ఓ స‌భ‌లో సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశాడు. ప‌హ‌ల్గామ్ దాడి త‌ర‌హాలోనే మ‌రో దాడి చేస్తామ‌ని హెచ్చ‌రించాడు. భార‌త్ వాట‌ర్ టెర్ర‌రిజ‌మ్ కు పాల్ప‌డుతోంద‌ని ఇండస్ వాటర్ ట్రీటీని ఉల్లంఘించిందన్నారు.

పహల్గామ్ తరహాలో మరో దాడి.. లష్కరే తోయిబా వార్నింగ్
X

దిశ‌, వెబ్ డెస్క్: ల‌ష్క‌రే తోయిబా డిప్యూటీ చీఫ్, ప‌హ‌ల్గామ్ దాడి సూత్ర‌దారి సైఫుల్లా క‌సూరి ఓ స‌భ‌లో సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశాడు. ప‌హ‌ల్గామ్ దాడి త‌ర‌హాలోనే మ‌రో దాడి చేస్తామ‌ని హెచ్చ‌రించాడు. భార‌త్ వాట‌ర్ టెర్ర‌రిజ‌మ్ కు పాల్ప‌డుతోంద‌ని ఇండస్ వాటర్ ట్రీటీని ఉల్లంఘించిందన్నారు. కాశ్మీర్ ప్రజలకు హామీ ఇస్తున్నా.. పాకిస్థాన్ మీతో ఉంది అని అన్నారు. మోడీకి మ‌రో పాఠం చెప్పాల‌ని మా సుప్రీం లీడర్ ఫీల్డ్ మార్షల్ అసిం మునీర్ కు అభ్యర్థిస్తున్నానని వ్యాఖ్యానించాడు. ఇదిలా ఉంటే సైఫుల్లా కసూరి పహల్గామ్ దాడిలో ప్రధాన సూత్రదారిగా ఉన్నాడు. దీంతో కసూరి వ్యాఖ్యలను ఇంటిజెన్స్ ఏజెన్సీలు సీరియస్ గా తీసుకున్నాయి. కాశ్మీర్‌లో భద్రతను మరింత పెంచుతున్నాయి. ఇక కసూరి స్పీచ్ పై భారత విదేశాంగమంత్రి ఎస్.జై శంకర్ స్పందించారు. పాకిస్థాన్ గ్లోబర్ టెర్రర్ ఎపిసెంటర్ అని అన్నారు.

Next Story