- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అమెరికాలో మరోసారి అగ్నిపర్వతం బద్దలు.. 100 అడుగుల మేర ఎగిసిపడ్డ లావా
అమెరికాలో మరోసారి అగ్నిపర్వతం బద్దలు అయింది.

దిశ, డైనమిక్ బ్యూరో: అమెరికాలో మరోసారి అగ్నిపర్వతం బద్దలు అయింది. హవాయి ద్వీపం లోని ప్రసిద్ధి చెందిన కిలోవేయ అగ్నిపర్వతం మళ్లీ రగులుతోంది. తాజాగా సంభవించిన విస్ఫోటనంలో లావా 30 మీటర్లు (సుమారు 100 అడుగులు) ఎత్తుకు ఎగసిపడి భయంకర దృశ్యాలు సృష్టించింది. భారీ ఉష్ణోగ్రతతో ఉబుకిన లావా, ఆ ప్రాంతంలో ఏర్పాటు చేసిన రిమోట్ కెమెరాకు చేరుకుని దుమ్ముతో కప్పివేసి, చివరకు కెమెరాను పూర్తిగా నిలిపేసింది.
ఈ దృశ్యాలను రికార్డ్ చేస్తున్న US జియలాజికల్ సర్వే (USGS) కెమెరా మొదట గ్లిచ్ అవుతూ కనిపించగా, కొద్ది సేపటికే పూర్తిగా ఆఫ్‌లైన్‌కి వెళ్లిపోయినట్లు అధికారులు తెలిపారు. ప్రపంచంలో అత్యంత చురుకైన అగ్నిపర్వతాలలో ఒకటైన కిలోవేయ గత సంవత్సరం డిసెంబర్ నుంచి ఇప్పటివరకు 38 సార్లు విస్ఫోటనం చెందింది. ఈ సందర్భంగా పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని హవాయి వల్కేనోస్ నేషనల్ పార్క్ అధికారులు తెలిపారు. అగ్నిపర్వతం చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రమాద సూచనలు జారీ చేశారు. సందర్శకులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. వీడియో ఇదే..






