Kidney Rocket : చికిత్స పేరిట కిడ్నీలు కొట్టేశారు

by Muthe.Rajitha |

కిడ్నీ(Kidney)లో రాళ్ళు ఉన్నాయంటూ ఏకంగా కిడ్నీలనే కొట్టేశారు కేటుగాళ్లు.

Kidney Rocket : చికిత్స పేరిట కిడ్నీలు కొట్టేశారు
X

దిశ, వెబ్ డెస్క్ : కిడ్నీ(Kidney)లో రాళ్ళు ఉన్నాయంటూ ఏకంగా కిడ్నీలనే కొట్టేశారు కేటుగాళ్లు. పాక్ లో జరిగిన ఈ ఘటన ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పాకిస్తాన్(Pakistan) లోని పంజాబ్ ప్రావిన్స్(Panjab Province) లో సాదికాబాద్ లో ఈ సంఘటన చోటు చేసుకుంది. మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసిన మోసగాళ్ళు.. కిడ్నీలో రాళ్ళు ఏర్పడ్డాయని వాటిని తొలగించే చికిత్స జరిపిస్తామని నమ్మబలికి 25 మందిని ఆసుపత్రికి తరలించారు. అక్కడ వారికి మత్తు మందు ఇచ్చి స్పృహ కోల్పోయాక వారి కిడ్నీలు కాజేశారు. తీరా ఆపరేషన్ జరిగాక విషయం తెలుసుకున్న బాధితులు లబోదిబో అన్నారు. ఈ ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. అయితే దీనిపై స్పందిస్తున్న నెటిజన్స్.. 'ప్రపంచంలో ఉన్న విచిత్రమైన మోసాలన్నీ మీ దగ్గరే జరుగుతాయి రా బాబూ' అంటున్నారు.

Next Story