బంగ్లాదేశ్‌లో కీలక పరిణామం.. 17 ఏళ్ల తర్వాత ఢాకా వస్తున్న మాజీ ప్రధాని కుమారుడు

by Naga Rani Yarlagadda |

బంగ్లాదేశ్ లో 2026లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అక్కడి రాజకీయ పరిణామాలు శరవేగంగా..

బంగ్లాదేశ్‌లో కీలక పరిణామం.. 17 ఏళ్ల తర్వాత ఢాకా వస్తున్న మాజీ ప్రధాని కుమారుడు
X

దిశ, వెబ్‌డెస్క్: బంగ్లాదేశ్ లో 2026లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అక్కడి రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. 17 సంవత్సరాలుగా లండన్లోనే ఉంటూ.. బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ (BNP)ని నడుపుతున్న, మాజీ ప్రధాని ఖలీదా జియా - మాజీ అధ్యక్షుడు జియావుర్ రెహమాన్ ల కొడుకు తారిఖ్ రెహమాన్ బంగ్లాదేశ్ రాజధాని ఢాకాకు రానున్నారు. గురువారం అతను ఢాకా చేరుకోనున్నట్లు బీఎన్పీ పార్టీ వర్గాలు తెలిపినట్లుగా అక్కడి మీడియా పేర్కొంది. భార్య జుబైదా రెహమాన్, కొడుకు జైమా రెహమాన్ తో కలిసి బిమాన్ బంగ్లాదేశ్ ఎయిర్ లైన్స్ లో లండన్ లోని హిత్రో ఎయిర్ పోర్టు నుంచి బయల్దేరి ఢాకాకు చేరుకోనున్నారు. అనంతరం పార్టీ మద్దతుదారుల్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు.

పార్టీ సభ్యులతో సమావేశం అనంతరం ఎవర్ కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తల్లి ఖలీదా జియాను కలవనున్నారు. ఈ నెల 27న రిజిస్టర్డ్ ఓటరుగా నమోదు చేసుకోనున్నట్లు మీడియా వర్గాలు వెల్లడించాయి.

Next Story