భారత్-అమెరికా మధ్య కీలక డీల్స్..? జైశంకర్, మార్కో రూబియా భేటీలో చర్చలు

by Ramesh Naini |   (  Updated:2026-05-24 08:19:32  IST  )

భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్, అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో మధ్య ఢిల్లీలో ఆదివారం జరిగిన సమావేశం ముగిసింది.

భారత్-అమెరికా మధ్య కీలక డీల్స్..? జైశంకర్, మార్కో రూబియా భేటీలో చర్చలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్, అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో మధ్య ఢిల్లీలో ఆదివారం జరిగిన సమావేశం ముగిసింది. అనంతరం ఏర్పాటు చేసిన సంయుక్త విలేకరుల సమావేశంలో జైశంకర్ మాట్లాడుతూ.. ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక ఒప్పందాలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. రక్షణ, వాణిజ్యం, ఇంధన రంగాలతో పాటు అంతర్జాతీయ పరిణామాలపై ఈ భేటీలో ఇరువురు నేతలు సుదీర్ఘంగా చర్చించారు. పశ్చిమాసియా పరిస్థితులపై ప్రధాని మోడీ, మార్కో రూబియో ప్రత్యేకంగా చర్చించినట్లు జైశంకర్ వెల్లడించారు.

రక్షణ, భద్రతా సహకారం

10 ఏళ్ల రక్షణ భాగస్వామ్య ఫ్రేమ్‌వర్క్ ఒప్పందాన్ని ఇటీవల పునరుద్ధరించుకున్నామని, అలాగే సమగ్ర ‘అండర్ వాటర్ డొమైన్ అవేర్‌నెస్ రోడ్‌మ్యాప్‌’పై ఇరుదేశాలు సంతకాలు చేశాయని తెలిపారు. రక్షణ రంగంలో ముందుకు వెళ్లే క్రమంలో ‘మేక్ ఇన్ ఇండియా’ విధానానికి ప్రాధాన్యత ఇవ్వాలని చర్చించారు. ఫిబ్రవరి 2025లో ప్రధాని మోడీ పర్యటనలో నిర్దేశించిన సమగ్ర ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంలో భాగంగా, త్వరలో పరస్పర ప్రయోజనకరమైన మధ్యంతర వాణిజ్య ఒప్పందాన్ని (Interim Agreement) పూర్తి చేయడంపై దృష్టి సారించారు. దీనికోసం త్వరలోనే అమెరికా బృందం భారత్‌లో పర్యటించనుంది.140 కోట్ల మంది భారతీయులకు అందుబాటు ధరలో ఇంధనాన్ని అందించడమే ప్రభుత్వ ప్రాథమిక బాధ్యత అని జైశంకర్ స్పష్టం చేశారు. ఇంధన వాణిజ్యం విస్తరణను స్వాగతిస్తున్నామన్నారు.

అణు ఇంధన సహకారం

అమెరికాలో ‘శాంతి చట్టం’ ఆమోదం పొందడంతో అణు రంగంలో కొత్త అవకాశాలు ఏర్పడ్డాయని, ఈ దిశగా సహకారాన్ని పెంచుకుంటామని తెలిపారు. అలాగే, అమెరికా వైపు ఉన్న కొన్ని నియంత్రణ సమస్యలను (Regulatory issues) కూడా తాను సెక్రటరీ మార్కో రూబియో దృష్టికి తీసుకెళ్లినట్లు మంత్రి జైశంకర్ పేర్కొన్నారు.

Next Story