- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భారీ వర్షాలు.. యూఏఈలో గోడ కూలి కేరళ యువకుడు మృతి
by Naga Rani Yarlagadda |
యూఏఈలో ప్రస్తుతం భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాల ధాటికి..

X
దిశ, వెబ్‌డెస్క్: యూఏఈలో ప్రస్తుతం భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాల ధాటికి రాస్ ఆల్ ఖైమా ప్రాంతంలో గోడకూలి ప్రవాస భారతీయుడు మృతి చెందాడు. మృతుడు కేరళలోని మలప్పురం ప్రాంతానికి చెందిన 27 ఏళ్ల యువకుడు సల్మాన్ ఫరీజ్ గా గుర్తించారు. అతను యూఏఈలో డెలివరీ బాయ్ గా పనిచేస్తున్నాడు. భారీ వర్షాలకు నిర్మాణంలో ఉన్న భవనం గోడ కూలడం, ఆ సమయంలో సల్మాన్ అక్కడే ఉండటంతో ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. మృతుడి వివరాలను ధృవీకరించేందుకు స్థానిక మీడియా రాస్ అల్ ఖైమా పోలీసుల కోసం ప్రయత్నించగా.. వారు అందుబాటులోకి రాలేదని తెలుస్తోంది.
Next Story






