- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జనసముహ ప్రాంతాల్లో కర్ణాటక కొత్త రూల్స్
బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జూన్ 4న జరిగిన తొక్కిసలాటలో 11 మంది ప్రాణాలు కోల్పోగా 56 మంది గాయపడటంపై కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి.

దిశ, నేషనల్ బ్యూరో: బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జూన్ 4న జరిగిన తొక్కిసలాటలో 11 మంది ప్రాణాలు కోల్పోగా 56 మంది గాయపడటంపై కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. దీంతో కర్ణాటక ప్రభుత్వం జనసమూహ నియంత్రణపై కఠినమైన చట్టాన్నిరూపొందించనుంది. ఈ బిల్లుపై గురువారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో చర్చించారు. వర్షాకాల అసెంబ్లీ సమావేశాల్లో దీన్ని ప్రవేశపెట్టే అవకాశం ఉంది. కర్ణాటక రాష్ట్రంలో ఈవెంట్ ప్లానర్లు నిర్వాహకులు నిబంధనలను ఉల్లంఘిస్తే, మూడు సంవత్సరాల జైలు శిక్ష రూ. 50 వేల నుంచి జరిమానా విధిస్తారు. తీవ్రమైన ఉల్లంఘనకు పాల్పడితే జరిమానా మరింత పెరిగే అవకాశం ఉంది. దీంతో పాటు నాన్ బెయిలబుల్ కేసులు పెట్టేలా కఠినమైన చట్టాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు.
మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా..
ఐపీఎల్ లో ఆర్సీబీ విజయం సందర్భంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అభిమానులు పెద్ద సంఖ్యలో చిన్నస్వామి స్టేడియానికి తరలివచ్చారు. చిన్నస్వామి స్టేడియం వద్ద ఇరుకైన ప్రవేశ ద్వారాల వద్ద గందరగోళం ఏర్పడి, అనూహ్యంగా జనం తోసుకురావడంతో తొక్కిసలాట జరిగింది. ఈ విషాదం తర్వాత బీజేపీ, జేడీఎస్ ప్రతిపక్షాలు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ల రాజీనామాను డిమాండ్ చేస్తూ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించాయి. ఇలాంటి ఘటనలను పునరావృతం కాకుండా చూసేందుకు ప్రభుత్వం ఈ చట్టాన్ని తీసుకురానుంది.






