న్యూయార్క్‌ మేయర్‌గా జోహ్రాన్ మమ్దానీ.. ఖురాన్‌పై ప్రమాణం చేసి సరికొత్త రికార్డు

by Ajay Maddhiboyina |

న్యూయార్క్ కొత్త మేయర్‌గా జోహ్రాన్ మమ్దానీ ప్రమాణస్వీకారం చేశారు. కొత్త సంవత్సరం 2026లో నూతన మేయర్ గా మమ్దానీ ఖురాన్ పై ప్రమాణం చేసి బాధ్యతలు స్వీకరించారు.

న్యూయార్క్‌ మేయర్‌గా జోహ్రాన్ మమ్దానీ.. ఖురాన్‌పై ప్రమాణం చేసి సరికొత్త రికార్డు
X

దిశ‌, వెబ్ డెస్క్: న్యూయార్క్ కొత్త మేయర్‌గా జోహ్రాన్ మమ్దానీ ప్రమాణస్వీకారం చేశారు. కొత్త సంవత్సరం 2026లో నూతన మేయర్ గా మమ్దానీ ఖురాన్ పై ప్రమాణం చేసి బాధ్యతలు స్వీకరించారు. దీంతో న్యూయార్క్ చరిత్రలో ఖురాన్ పై ప్రమాణం చేసిన తొలి మేయర్ గా మమ్దానీ నిలిచారు. ఈ కీలక పదవిని అధిష్ఠించిన మొదటి ముస్లిం, దక్షిణాసియా వాసి, ఆఫ్రికన్ వంశానికి చెందిన వ్యక్తిగా కూడా మమ్దానీ రికార్డు సృష్టించారు.

మమ్దానీ ప్రమాణస్వీకార వేడుకను సైతం విభిన్నంగా నిర్వహించారు. మన్హటన్ భూగర్భంలో 1945 నుండి మూసి వేసి ఉన్న చారిత్రక ఓల్డ్ సిటీ హాల్ సబ్ వే స్టేషన్‌ను వేడుక కోసం ఉపయోగించారు. తన ప్రసంగంలో జోహ్రాన్.. ఈ నగరాన్ని నడిపించే శ్రామికవర్గం పట్ల నాకు ఉన్న గౌరవానికి ఇది సంకేతం అంటూ వ్యాఖ్యానించారు. మమ్మానీ ప్రమాణ స్వీకారోత్సం న్యూయార్క్ అటార్నీ జనరల్ లెటిటియా జేమ్స్ సమక్షంలో తన కుటుంబ సభ్యుల మధ్య జరిగింది.

Next Story