- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇజ్రాయిల్ లో తగ్గిపోతున్న ఆయుధ సామర్థ్యం..
ఇజ్రాయిల్ ఇరాన్ పై వరుస క్షిపణి దాడులతో ఆయుధ నిల్వలు భారీగా కరిగిపోతున్నాయని ‘వాల్ స్ట్రీట్ జర్నల్’ తాజా నివేదికలో వెల్లడించింది.

దిశ, నేషనల్ బ్యూరో: ఇజ్రాయిల్ ఇరాన్ పై వరుస క్షిపణి దాడులతో ఆయుధ నిల్వలు భారీగా కరిగిపోతున్నాయని ‘వాల్ స్ట్రీట్ జర్నల్’ తాజా నివేదికలో వెల్లడించింది. ఇతర దేశాల నుంచి వచ్చే మిస్సైళ్లను సమర్థవంతంగా ఎదుర్కొనే ఐరన్ డోమ్ వ్యవస్థ, ఇతర రక్షణ నిల్వల సామర్థ్యానికి రోజు వేల డాలర్లలో ఖర్చు పెట్టాల్సి వస్తోందని తెలుస్తోంది. దీంతో రక్షణ ఉత్పత్తులను పెంచుకోవాలని, లేకపోతే వ్యవస్థల మధ్య స్థిరత్వం దెబ్బతినే అవకాశం ఉందని కథనంలో పేర్కొంది. ఇజ్రాయెల్ ప్రారంభించిన “ఆపరేషన్ రైజింగ్ లయన్” తర్వాత ఇరాన్ సుమారు 400 బాలిస్టిక్ క్షిపణులను ఇజ్రాయిల్ పైకి ప్రయోగించింది. ఇవి ఇజ్రాయెల్ ‘ఏరో సిస్టమ్’, ఐరన్ డోమ్’, ‘పేట్రియట్’, ‘THAAD’ వంటి బహుళ రక్షణ వ్యవస్థలు దాటుకుని మరీ ఇజ్రాయిల్ లో విధ్వంసం సృష్టించాయి. తాజాగా ఇరాన్ చేసిన దాడుల్లో 24 మంది ఇజ్రాయిల్ పౌరులు మరణించడం కూడా వ్యవస్థల్లో ఏర్పడుతున్న బలహీతనను చాటి చెబుతున్నాయి.
12 రోజులకు సరిపోయే ఆయుధ నిల్వలు
తాము చేసిన దాడుల్లో ఇరాన్ క్షిపణి స్థావరాల్లో మూడవ వంతు ధ్వంసమయ్యాయని టెల్ అవీవ్ అధికారి వెల్లడించారు. అయినప్పటికీ, మిగిలిన నిల్వలు ఇంకా భూగర్భాల్లో దాచివుండొచ్చని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరిస్తున్నాయి. ఒక్కో ‘ఏరో’ ఇంటర్‌సెప్టర్ ఖరీదు దాదాపు 3 మిలియన్ డాలర్లు కాగా, ఒక్క రాత్రి మొత్తం క్షిపణి రక్షణపై 285 మిలియన్లు డాలర్ల ఖర్చవుతోందని తెలుస్తోంది. ఇరాన్ ఇక నుంచి రోజూ వారీగా దాడులు కొనసాగిస్తే, తగిన ఆర్థిక లేదా సాంకేతిక మద్దతు లేకుండా ఇజ్రాయెల్ ఈ రక్షణ వ్యవస్థలను గరిష్ఠంగా 10–12 రోజులు మాత్రమే కొనసాగించగలదని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరిస్తున్నాయి. ఇప్పటికే ఈ ఒత్తిడి ప్రభావాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి కొన్ని క్షిపణులు IDF ప్రధాన కార్యాలయం వద్ద, హైఫా చమురు శుద్ధి కేంద్రం వద్ద గూఢచార విభాగం సమీపంలో పేలాయి. ఇజ్రాయెల్ అధికారిక సమాచారం ప్రకారం, తాజా ఉద్రిక్తతల నేపథ్యంలో ఇప్పటివరకు 24 మంది మృతి చెందగా, 600 మందికి పైగా గాయపడ్డారు. ఇరాన్‌పై జరిగిన ప్రతిదాడుల్లో అణు, చమురు, సైనిక స్థావరాలకు భారీ నష్టం వాటిల్లినప్పటికీ, ఇజ్రాయెల్ తన ఖరీదైన రక్షణ వ్యవస్థలను ఎంతకాలం కొనసాగించగలదనేది ఇప్పుడు ప్రధాన ప్రశ్నగా మారింది.






