ప్రధాని మోడీకి ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యహు ఫోన్

by Gantepaka Srikanth |

ప్రధాని నరేంద్ర మోడీ(Narendra Modi)కి ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు(Israeli PM Netanyahu) ఫోన్ చేశారు. ఇరాన్‌పై దాడి, అనంతర పరిస్థితులను వివరించారు.

ప్రధాని మోడీకి ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యహు ఫోన్
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రధాని నరేంద్ర మోడీ(Narendra Modi)కి ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు(Israeli PM Netanyahu) ఫోన్ చేశారు. ఇరాన్‌పై దాడి, అనంతర పరిస్థితులను వివరించారు. మోడీతో పాటు పలువురు దేశాధినేతలకు కూడా నెతన్యాహు ఫోన్ చేసి పరిస్థితితి వివర్శించారు. కాగా, ఇరాన్, ఇజ్రాయెల్ దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు తారా స్థాయికి చేరుకున్నాయి. ఇరాన్(Iran) బలగాలు, మిలటరీ నాయకత్వాన్ని లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ వరుస దాడులు జరిపింది. ఈ దాడులను ఇజ్రాయెల్ ప్రభుత్వం సమర్ధించుకోవడంతో పాటు ముందస్తు చర్యగా ఈ ఆపరేషన్ నిర్వహించినట్టు ఇజ్రాయెల్ ప్రకటించింది.

మరోవైపు ఈ ఉద్రిక్తతలపై భారత్‌ (India) స్పందిస్తూ ఆందోళన వ్యక్తం చేసింది. దౌత్యమార్గాలతో సమస్యను పరిష్కరించుకోవాలని ఈ సందర్భంగా ఇరుదేశాలకు సూచించింది. భారత విదేశాంగ శాఖ ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. దాడులతో సహా అన్ని విషయాలను నిశితంగా గమనిస్తున్నామని తెలిపింది. ఉద్రిక్తతలు మరింత తీవ్రతరం కాకుండా చూసుకోవాలని ఇరుదేశాలను కోరింది. దౌత్యపరమైన మార్గాల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని సూచించింది. ఇరాన్‌- ఇజ్రాయెల్‌తో తమకు సన్నిహితమైన సంబంధాలు ఉన్నాయని, సమస్యను పరిష్కరించుకునేందుకు తాము మద్దతిస్తామని ఈసందర్భంగా న్యూఢిల్లీ పేర్కొంది.

Next Story