- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మరోసారి గాజాపై ఇజ్రాయెల్ మెరుపు దాడి.. 33 మంది మృతి
మరోసారి గాజాపై ఇజ్రాయెల్ మెరుపు దాడి చేసింది. తాజా దాడుల్లో కనీసం 33 మంది పాలస్తీనీయులు మృతి చెందగా, పలువురు గాయపడ్డారని స్థానిక వైద్యాధికారులు తెలిపారు.

దిశ, వెబ్ డెస్క్: మరోసారి గాజాపై ఇజ్రాయెల్ మెరుపు దాడి చేసింది. తాజా దాడుల్లో కనీసం 33 మంది పాలస్తీనీయులు మృతి చెందగా, పలువురు గాయపడ్డారని స్థానిక వైద్యాధికారులు తెలిపారు. అమెరికా మద్దతుతో నెల క్రితం అమల్లోకి వచ్చిన కాల్పుల విరమణ తర్వాత చోటుచేసుకున్న అత్యంత తీవ్రమైన దాడిగా ఇది నిలిచింది. ఖాన్ యూనిస్‌లోని నజర్ ఆసుపత్రి వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం.. ఇరానుంచి తరలించబడిన నిరాశ్రయుల టెంట్లపై జరిగిన నాలుగు ఎయిర్‌స్ట్రైక్‌లలో 17 మంది మృతదేహాలు ఆసుపత్రికి చేరాయి, వీరిలో ఐదుగురు మహిళలు, ఐదుగురు చిన్నారులు ఉన్నారు.
గాజా సిటీ లో జరిగిన రెండు వేర్వేరు వైమానిక దాడుల్లో మరో 16 మంది మృతి చెందగా.. వారిలో ఏడుగురు పిల్లలు, ముగ్గురు మహిళలు ఉన్నట్లు గుర్తించారు. ఖాన్ యూనిస్‌లో తమ సైనికులపై కాల్పులు జరగడంతో ప్రతిగా దాడులు చేశామని ఇజ్రాయెల్ పేర్కొనగా, తమ వైపు ఎలాంటి నష్టం జరగలేదని కూడా తెలిపింది. ఈ దాడులను హమాస్ “ఘోర హత్యాకాండ”గా ఖండిస్తూ, ఇజ్రాయెల్ సైనికులపై తమవారు కాల్పులు జరపలేదని స్పష్టం చేసింది. గాజా ప్రజలు రెండు సంవత్సరాల యుద్ధం ఎప్పుడు ఆగలేదనే భావనలో ఉన్నామని, కాల్పుల విరమణ అమల్లో ఉన్నప్పటికీ ఇప్పటివరకు 300 మందికి పైగా ఇజ్రాయెల్ దాడుల్లో ప్రాణాలు కోల్పోయినట్టు స్థానిక అధికారులు చెబుతున్నారు.






