టెహ్రాన్‌పై ఇజ్రాయెల్ మరో మెరుపు దాడి.. సుప్రీం లీడర్ ఖమేనీ విమానం ధ్వంసం

by Ramesh Naini |

ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లోని మెహ్రాబాద్ విమానాశ్రయంపై ఇజ్రాయెల్ వాయుసేన మరోసారి విరుచుకుపడింది.

టెహ్రాన్‌పై ఇజ్రాయెల్ మరో మెరుపు దాడి.. సుప్రీం లీడర్ ఖమేనీ విమానం ధ్వంసం
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లోని మెహ్రాబాద్ విమానాశ్రయంపై ఇజ్రాయెల్ వాయుసేన మరోసారి విరుచుకుపడింది. నిన్న రాత్రి జరిగిన ఈ మెరుపు దాడిలో ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీకి చెందిన వ్యక్తిగత విమానాన్ని ధ్వంసం చేసినట్లు ఇజ్రాయెల్ రక్షణ దళం (IDF) అధికారికంగా ప్రకటించింది. ఈ విమానాన్ని ఖమేనీతో పాటు ఇరాన్ ఉన్నతాధికారులు కీలకమైన సైనిక సేకరణ ఇతర దేశాలతో 'యాక్సిస్' కోసం ఉపయోగించేవారని ఇజ్రాయెల్ వెల్లడించింది. అంతర్గత, అంతర్జాతీయ ప్రయాణాల ద్వారా ప్రాక్సీ గ్రూపులతో సమన్వయం సాధించడానికి ఈ విమానం ఒక "వ్యూహాత్మక ఆస్తి"గా పనిచేస్తోందని, దీని విధ్వంసం ఇరాన్ సైనిక శక్తికి, సమన్వయ సామర్థ్యానికి పెద్ద దెబ్బ అని ఐడీఎఫ్ పేర్కొంది.

ఇరాన్ ఎత్తుగడలు చిత్తు..!

ఇజ్రాయెల్ దాడుల నుంచి తప్పించుకోవడానికి ఇరాన్ తన కీలక విమానాలను పాతబడిన, పనికిరాని విమానాలు ఉంచే స్టోరేజ్ ఏరియాల్లో దాచి ఉంచిందని.. అయినప్పటికీ ఖచ్చితమైన సమాచారంతో వాటిని గుర్తించి ధ్వంసం చేసినట్లు ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది.

Next Story