గాజాపై కొనసాగుతున్న దాడులు.. 57 మంది మృతి

by Ajay Maddhiboyina |

గాజాపై ఇజ్రాయెల్ దాడులు కొన‌సాగుతూనే ఉన్నాయి. సీజ్ ఫైర్ కు హ‌మాస్ అంగీక‌రించ‌క‌పోవ‌డంతో ఇజ్రాయెల్ దాడి చేస్తూనే ఉంది. గురువారం నుండి ఇజ్రాయెల్ ప‌లుచోట్ల చేప‌ట్టిన దాడుల్లో 57 మంది పాల‌స్తీనియ‌న్లు మ‌ర‌ణించారు.

గాజాపై కొనసాగుతున్న దాడులు.. 57 మంది మృతి
X

దిశ‌, వెబ్ డెస్క్: గాజాపై ఇజ్రాయెల్ దాడులు కొన‌సాగుతూనే ఉన్నాయి. సీజ్ ఫైర్ కు హ‌మాస్ అంగీక‌రించ‌క‌పోవ‌డంతో ఇజ్రాయెల్ దాడి చేస్తూనే ఉంది. గురువారం నుండి ఇజ్రాయెల్ ప‌లుచోట్ల చేప‌ట్టిన దాడుల్లో 57 మంది పాల‌స్తీనియ‌న్లు మ‌ర‌ణించారు. సౌత్ గాజాలో 27 మంది, ఆహార పంపిణీ కేంద్రాల వ‌ద్ద 30 మంది చ‌నిపోయినట్టు వైద్య అధికారులు వెల్ల‌డించారు. మ‌రోవైపు గాజాకు సాయం చేసేందుకు 40కి పైగా షిప్పులు రాగా వాటిని సైతం ఇజ్రాయెల్ బ‌ల‌గాలు త‌గ‌ల‌బెట్టాయి.

గాజాను విడిచిపెట్టి పాల‌స్తీనియ‌న్లు వెంట‌నే వెళ్లిపోవాల‌ని ఇజ్రాయెల్ రక్ష‌ణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ హెచ్చ‌రించారు. పారిపోవ‌డానికి ఇదే చివ‌రి అవకాశ‌మ‌ని వార్నింగ్ ఇచ్చారు. పాల‌స్తీనీయులు ఎవ‌రైనా ఇంకా న‌గ‌రంలో ఉంటే వారిని మిలిటెంట్ల మ‌ద్ద‌తుదారులుగా ప‌రిగ‌ణిస్తామ‌ని స్ప‌ష్టం చేశారు. ఇదిలా ఉంటే ట్రంప్ సీజ్ ఫైర్ కోసం చేసిన‌ 20 సూత్రాల ప్ర‌తిపాద‌న‌ల‌పై హ‌మాస్ ఇంకా ఆలోచిస్తూనే ఉంది. ఈ నేప‌థ్యంలో ఇజ్రాయెల్ దాడుల‌ను ఆప‌డంలేదు.

Next Story