- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇరాన్‌పై మరోసారి విరుచుకుపడ్డ ఇజ్రాయెల్..60 మంది మృతి
ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. రెండు దేశాలు మెరుపు దాడులు చేసుకుంటున్నాయి.

దిశ, వెబ్ డెస్క్: ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. రెండు దేశాలు మెరుపు దాడులు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా ఇజ్రాయెల్ ఇరాన్ పై విరుచుకుపడుతోంది.ఇప్పటికే ఇరాన్ అణుస్థావరాలపై ఇజ్రాయెల్ దాడి చేయగా కొంతమంది అణుశాస్త్రవేత్తలు చనిపోయారు. దీనికి ప్రతీకారంగా ఇరాన్ సైతం ఇజ్రాయెల్ పై క్షిపణి దాడి చేసింది. ఈ దాడిలో 200 మందికి పైగా గాయపడగా, ఐదుగురు మరణించారు. మూడు రోజులుగా ఎయిర్ స్ట్రైక్ కొనసాగగా ఈ రోజు సైతం ఇరాన్ పై ఇజ్రాయెల్ విరుచుకుపడింది.
టెహ్రాన్ పై దాడి చేయడంతో 60 మంది కన్నుమూశారు. ఇజ్రాయెల్ టెహ్రాన్ లోని టాప్ లీడర్లనే లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడుతోంది. నిన్న టెహ్రాన్ లోని మోనిరియాలో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ నివాసానికి సమీపంలో కూడా వైమానిక దాడులకు పాల్పడింది. దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అయ్యాయి. ప్రపంచ పటంలో లేకుండా చేస్తామని చెబుతున్న ఇరాన్ అణుకార్యక్రమాలను నాశనం చేసేంత వరకు దాడులను ఆపేది లేదని ఇజ్రాయెల్ చెబుతోంది. ఈ క్రమంలో రెండు దేశాల మధ్య ఎప్పుడు ఎలాంటి పరిస్థితి వస్తుందో అన్న ఆందోళన ప్రజల్లో మొదలైంది.






