ఇరాన్ షాకింగ్ నిర్ణయం.. ఐఏఈఏకి సహకరించబోమంటూ మరోసారి స్పష్టం

by Yella Dhawani Reddy |   (  Updated:2025-07-02 12:53:30  IST  )

ఇరాన్‌ (Iran) తాజా రాజకీయ పరిణామాల్లో ఒక నూతన చట్టం కీలకంగా నిలిచింది.

ఇరాన్ షాకింగ్ నిర్ణయం.. ఐఏఈఏకి సహకరించబోమంటూ మరోసారి స్పష్టం
X

దిశ, వెబ్ డెస్క్: ఇరాన్‌ (Iran) తాజా రాజకీయ పరిణామాల్లో కీలకంగా నిలిచింది ఒక నూతన చట్టం. అంతర్జాతీయ అణు శక్తి సంస్థ (IAEA)తో ఇకపై సహకరించబోమని పేర్కొన్న ఈ చట్టానికి ఇటీవలే ఆ దేశ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్‌ (Masoud Pezeshkian) అధికారిక ఆమోదం తెలిపారు. గత నెలలో ఇరాన్‌ పార్లమెంట్‌ ఈ చట్టానికి మంజూరు ఇచ్చింది. ఈ చట్టం ప్రకారం, ఇరాన్‌ అణు కార్యక్రమాలను పర్యవేక్షించే ఐఏఈఏ శ్రామికులకు లేదా పర్యవేక్షణ చర్యలకు ఇకపై అనుమతించదని స్పష్టం చేసింది. ఈ నిర్ణయం తాజాగా అమెరికా తమ అణు స్థావరాలపై చేసిన దాడులను తీవ్రంగా ఖండించిన ఇరాన్‌, తమ స్వావలంబన, అణు హక్కులను పరిరక్షించుకునే క్రమంలో ఈ నిర్ణయం తీసుకుంది.

ఇజ్రాయెల్ దాడులకు ముందు, ఇరాన్‌కు వ్యతిరేకంగా ఐఏఈఏ చీఫ్ రాఫెల్ గ్రోసీ తీర్మానాన్ని ఆమోదించారు. ఈ తీర్మానాన్ని యూకే, ఫ్రాన్స్, జర్మనీ ప్రతిపాదించగా, అమెరికా మద్దతిచ్చిందని, ఈ నేపథ్యంలోనే ఇరాన్ కొత్త అణు కేంద్రం, సెంట్రిఫ్యూజ్​లను అధునాతన స్థాయికి అప్​గ్రేడ్ చేయటం గురించి ప్రకటనలు వెలువడ్డాయని అక్కడి వార్త సంస్త తెలిపింది. ఇక ఈ చట్టం ప్రకారం దేశ అణు సౌకర్యాల భద్రత నిర్ధరించే వరకు, శాంతియుత అణు కార్యకలపాలకు హామీ ఇచ్చే వరకు ఐఏఈఏ పరిశీలకులకు ఇరాన్​లో ప్రవేశం అనుమతింబడదు. ఈ నిర్ణయం ఇరాన్ సుప్రీం నేషన్ల్ సెక్యూరిటీ కౌన్సిల్ ఆమోదంపై ఆధాపడి ఉంటుంది.

ఇదిలా ఉండగా, అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో అణుకేంద్రాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని ఇరాన్‌ విదేశాంగ మంత్రి అబ్బాస్‌ అరాగ్చీ ఓ ఆంగ్ల వార్తాసంస్థతో తెలిపారు. ఆ నష్టాన్ని ఎవరూ కచ్చితంగా చెప్పలేరని పేర్కొన్నారు. ప్రస్తుతం ఇరాన్‌ అటామిక్‌ ఎనర్జీ ఆర్గనైజేషన్‌ నష్టాన్ని అంచనా వేస్తోందని వెల్లడించారు.

Next Story