- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇరాన్ విధ్వంసం..దుబాయ్‌లో భారీ డ్రోన్ దాడి
అమెరికా రాయబార కార్యాలయం లక్ష్యంగా ఈ దాడి చేసింది ఇరాన్.

దిశ, వెబ్ డెస్క్: ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్, అమెరికా మధ్య వార్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. దాదాపు నాలుగు రోజుల నుంచి ఈ యుద్ధం భయంకరంగా జరుగుతోంది. ఇజ్రాయెల్, అమెరికా కలిసి ఎటాక్ చేస్తున్న నేపథ్యంలో, గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులకు తెగబడుతోంది. ఇప్పటికే దుబాయ్, అబుదాబీ, ఖతర్, కువైట్ లాంటి ప్రాంతాలపై విరుచుకుపడింది ఇరాన్. ఇక లేటెస్ట్ గా దుబాయిలో మరో డ్రోన్ వదిలింది. అమెరికా రాయబార కార్యాలయం లక్ష్యంగా ఈ దాడి చేసింది ఇరాన్. దుబాయ్‌లోని అమెరికా కాన్సులేట్‌పై ఇరానియన్ షాహెద్ డ్రోన్ దాడి చేసింది.
ఈ సంఘటనలో అమెరికా కాన్సులేట్ భవనం తీవ్రంగా దెబ్బతిన్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రాణ నష్టం గురించి ఇంకా తెలియాల్సి ఉంది. ఇది ఇలా ఉండగా ఇప్పటికే ఇరాన్ సుప్రీం అయతుల్లా అలీ ఖమేనీని ఇజ్రాయెల్ చంపేసిన సంగతి తెలిసిందే. అయతుల్లా అలీ ఖమేనీ కార్యాలయం పై దాదాపు 30 బాంబులు వేసినట్లు సమాచారం. దీంతో ఒక అయతుల్లా అలీ ఖమేనీతోపాటు ఆయన ఫ్యామిలీ కూడా చనిపోయింది. ఈ మేరకు ఇరాన్ మీడియా కూడా ధ్రువీకరించింది.






