Hormuz Strait : హర్మోజ్ జలసంధి మూసివేతకు ఇరాన్ పార్లమెంటు ఆమోదం

by Muthe.Rajitha |

ప్రపంచ చమురు వాణిజ్యానికి ఎంతో కీలకం అయిన హార్మోజ్ జలసంధి(Hormuz Strait)ని మూసివేసేందుకు ఇరాన్ సిద్ధం అయింది.

Hormuz Strait : హర్మోజ్ జలసంధి మూసివేతకు ఇరాన్ పార్లమెంటు ఆమోదం
X

దిశ, వెబ్ డెస్క్ : ప్రపంచ చమురు వాణిజ్యానికి ఎంతో కీలకం అయిన హార్మోజ్ జలసంధి(Hormuz Strait)ని మూసివేసేందుకు ఇరాన్ సిద్ధం అయింది. ఈ మేరకు నేడు ఇరాన్ పార్లమెంటు(Iran Parliament) హార్మోజ్ జలసంధి మూసివేతకు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. అయితే దీనిపై సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ(Ayatollah Ali Khamenei) నేతృత్వంలోని కమిటీ తుది నిర్ణయం తీసుకోనుంది. మరోవైపు మరికొద్ది గంటల్లో హార్మోజ్ జలసంధిని మూసివేస్తామని ఇరాన్ నేవీ ప్రకటించింది. అమెరికా ఫోర్డో, నటాంజ్, ఇస్ఫహాన్ అణు స్థావరాలపై జరిపిన వైమానిక దాడులు, ఇజ్రాయెల్‌తో నడుస్తున్న ఉద్రిక్తల(Iran-Israel War) నేపథ్యంలో ఇరాన్ ఈ నిర్ణయం తీసుకుంది.

హర్మోజ్ జలసంధి... పర్షియన్ గల్ఫ్‌ను ఒమన్ గల్ఫ్‌తో కలిపే 33 కిలోమీటర్ల వెడల్పు గల కీలక జలమార్గం. ప్రపంచ చమురు సరఫరాలో 20-21% (రోజుకు 20 మిలియన్ బ్యారెల్స్), అలాగే సౌదీ అరేబియా, ఇరాక్, యూఏఈ, కువైత్ నూనె ఎగుమతులు, ఖతార్ యొక్క LNG ఎగుమతులు ఈ జలసంధి గుండా రవాణా అవుతాయి. ఆయా దేశాల ఎగుమతులు ఈ మార్గంపైనే ఆధారపడి ఉన్నాయి. ఇరాన్ నావల్ మైన్స్, యాంటీ-షిప్ మిస్సైల్స్, డ్రోన్స్, ఫాస్ట్ ఎటాక్ బోట్స్, మిడ్జెట్ సబ్‌మెరీన్స్ ద్వారా ఈ జలసంధిని మూసివేయగల సామర్థ్యం కలిగి ఉంది.

ఇదే జరిగితే బ్రెంట్ క్రూడ్ ధరలు బ్యారెల్‌కు $120-$150కి చేరవచ్చని తెలుస్తోంది. ఇంధన ధరల పెరుగుదల, రిఫైనరీ కార్యకలాపాలు, వాణిజ్య ఎగుమతులు దిగుమతులు ఘోరంగా దెబ్బతింటాయి. ఇంధన ధరలు ఆకాశాన్ని అంటడంతో ద్రవ్యోల్బణం పెరుగుతుంది. రూపాయి విలువ మరింత ఒత్తిడికి గురయ్యే అవకాశాలు ఉన్నాయని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Next Story