- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Tel Aviv: టెల్ అవీవ్ పై ఇరాన్ మిస్సైళ్ల దాడి
ఇరాన్, ఇజ్రాయిల్ మధ్య యుద్ధం ముదురుతోంది. శనివారం తెల్లవారుజామున ఇరాన్ క్షిపణులు, రాకెట్లు ఇజ్రాయిల్ రాజధాని టెల్ అవీవ్ (Tel Aviv) లో విధ్వంసం సృష్టించాయి.

దిశ, నేషనల్ బ్యూరో: ఇరాన్, ఇజ్రాయిల్ మధ్య యుద్ధం ముదురుతోంది. శనివారం తెల్లవారుజామున ఇరాన్ క్షిపణులు, రాకెట్లు ఇజ్రాయిల్ రాజధాని టెల్ అవీవ్ (Tel Aviv) లో విధ్వంసం సృష్టించాయి. ఈ దాడిలో ఇజ్రాయిల్ పౌరులు 34 మంది గాయపడగా.. ఒకరు మరణించినట్లు ఆ దేశ ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. ఇజ్రాయెల్‌లోని రెండు అతిపెద్ద నగరాలైన టెల్ అవీవ్, జెరూసలేంలో పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. మధ్యప్రాచ్యంలోని రెండు అతిపెద్ద ప్రత్యర్థుల మధ్య శత్రుత్వం తీవ్రమైంది. ఇజ్రాయెల్ ఇరాన్ పై ఇప్పటికే దాడి చేయగా 72 మంది చనిపోగా.. వందల సంఖ్యలో సామాన్య ప్రజలకు గాయాలైనట్లు ఇరాన్ అధికారికంగా ప్రకటించింది. ఈ దాడికి ప్రతి దాడి చేస్తామని హెచ్చరించి వందల మిస్సైళ్లలో ఇజ్రాయిల్ పై ఎటాక్ చేసింది.
అణ్వాయుధాల తయారీ ఆపితేనే..
ఇరాన్ అణ్వాయుధాలను అభివృద్ధి చేయకుండా నిరోధించే లక్ష్యంతో ఇజ్రాయెల్ అతిపెద్ద దాడిని ప్రారంభించిన ఒక రోజు తర్వాత, శనివారం తెల్లవారుజామున ఇరాన్ ఇజ్రాయెల్ పై వైమానిక దాడులకు దిగింది. ఇరాన్ ప్రయోగించిన మిస్సైళ్ల దాడిని అడ్డుకుంటున్నామని ఇజ్రాయిల్ ప్రకటించింది. ఇజ్రాయిల్ ఇరాన్ రాజధాని టెహ్రాన్ పై మరోసారి మిస్సైళ్లలో ఎటాక్ చేసింది. దీంతో టెహ్రాన్ నగరం మొత్తం బాంబు దాడులతో దద్దరిల్లింది. కొన్ని మిస్సైళ్లు ఇరాన్ నాయకులు ఉండే ప్రదేశానికి సమీపంలో పడ్డట్లు తెలుస్తోంది. ఇజ్రాయిల్ ప్రధానమంత్రి బెంజిమన్ నెతన్యాహు (Benjamin Netanyahu) మాట్లాడుతూ.. ఇరాన్ అణు కార్యక్రామాలను ఇక సాగనివ్వం అని ప్రకటించారు. అమెరికా ఇరాన్‌ను అణు ఒప్పందంపై సంతకం చేయమని కోరుతున్న సమయంలో ఈ దాడి జరగడం గమనార్హం. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఇరాన్ తన అణు కార్యక్రమం ఒప్పందంపై చర్చలు జరపాలని పిలుపునిచ్చారు. ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ ఇజ్రాయెల్, ఇరాన్‌లు దాడులు ఆపాలని కోరారు. దౌత్య మార్గంలో సమస్యను పరిష్కరించుకోవాలని కోరారు.






