తగ్గేదేలే..ఇజ్రాయెల్ ఎంబసీలన్నీ ధ్వంసం చేస్తామని ఇరాన్ వార్నింగ్

by velandi.Saikiran |

లెబ‌నాన్ లోని తమ ఎంబసీలపై ఇజ్రాయెల్ దాడి చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించింది ఇరాన్.

తగ్గేదేలే..ఇజ్రాయెల్ ఎంబసీలన్నీ ధ్వంసం చేస్తామని ఇరాన్ వార్నింగ్
X

దిశ‌, వెబ్ డెస్క్‌: ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్ మధ్య భయంకరమైన యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. దాదాపు 5 రోజులుగా వీళ్ళ మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది. అయితే ఇలాంటి నేపథ్యంలో ఇరాన్ సుప్రీం ఖ‌మేనీ మరణించారు. అయినప్పటికీ ఇరాన్ ఏ మాత్రం తగ్గడం లేదు. అంతేకాదు తాజాగా ఇజ్రాయెల్ కు స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చింది ఇరాన్. ఇజ్రాయిల్ ఎంబసీలన్నీ ధ్వంసం చేస్తామని హెచ్చరించింది.

ఇజ్రాయిల్ ఎంబసీలన్నీ ధ్వంసం చేస్తామని వార్నింగ్

లెబ‌నాన్ లోని తమ ఎంబసీలపై ఇజ్రాయెల్ దాడి చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించింది ఇరాన్. తమ ఎంబసీ జోలికి వస్తే.. ప్రపంచంలో ఉన్న ఇజ్రాయెల్ ఎంబసీలు అన్నిటినీ ధ్వంసం చేస్తామని.. ఆ దిశగా దాడులు చేస్తామని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ఈ మేరకు ఇరాన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ప్రతినిధి షెకార్చి సంచలన ప్రకటన చేశారు. అంతకు ముందు లేబనాన్‌ లోని ఇరాన్ ఎంబసీలో ఉంటున్న ప్రతినిధులు ఖాళీ చేయాలని..ఇందుకు 24 గంటల గడువు ఇస్తున్నట్లు ఇజ్రాయెల్ ప్రకటన చేసింది. ఈ త‌రుణంలోనే రివర్స్ వార్నింగ్ ఇచ్చింది ఇరాన్‌.

Next Story