- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇరాన్ వైపు అమెరికా యుద్ధనౌకలు.. దాడి భయంతో బంకర్లోకి సుప్రీం లీడర్
ఇరాన్ పై అమెరికా దాడికి సిద్ధమవుతుందన్న సంకేతాలు ఆ దేశాన్ని రోజురోజుకూ భయంగుప్పిట్లోకి నెడుతున్నాయి. ఈ నేపథ్యంలో దేశ అధినేత చుట్టూ అధికారులు రక్షణ గోడలు కడుతున్నారు.

దిశ, వెబ్‌డెస్క్: ఇరాన్ పై అమెరికా దాడికి సిద్ధమవుతుందన్న సంకేతాలు ఆ దేశాన్ని రోజురోజుకూ భయంగుప్పిట్లోకి నెడుతున్నాయి. ఈ నేపథ్యంలో దేశ అధినేత చుట్టూ అధికారులు రక్షణ గోడలు కడుతున్నారు. ఇందులో భాగంగా దేశ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీని టెహ్రాన్లోని ఓ బంకర్ కు తరలించినట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది. ఇరాన్ పై అమెరికా ఏ క్షణమైనా దాడికి దిగే అవకాశాలెక్కువగా ఉన్నాయని సీనియర్ మిలిటరీ అధికారులు హెచ్చరించిన నేపథ్యంలోనే.. సుప్రీం లీడర్ ను బంకర్ కు తరలించినట్లు తెలుస్తోంది. ఈ బంకర్ ను టెహ్రాన్ లో పలు సొరంగ మార్గాలకు లింక్ చేసినట్లు సమాచారం. ప్రస్తుతం ఖమేనీ.. తన కార్యాలయ బాధ్యతలను చిన్న కొడుకైన మసూద్ ఖమేనీకి అప్పగించినట్లు మీడియా వెల్లడించింది. ఎమర్జెన్సీ సమయాల్లో కార్యనిర్వాహక వర్గంతో సమన్వయం చేసే బాధ్యతలు కూడా ఆయనకే అప్పగించినట్లు అక్కడి మీడియా పేర్కొంది. కాగా.. ఈ వార్తలపై ఇరాన్ అధికారులు ఇప్పటి వరకూ ఎలాంటి ప్రకటన చేయలేదు.






