ఉద్రిక్తతల వేళ ఇరాన్‌కు భారీ దెబ్బ.. ప్రెసిడెంట్ పెజిష్కియాన్ రాజీనామా?

by Ajay Maddhiboyina |

ఇరాన్ ప్రెసిడెంట్ పెజిష్కియాన్ రాజీమానా లేఖ‌ను స‌మ‌ర్పించిన‌ట్టు అంత‌ర్జాతీయ‌ మీడియాలో వార్త‌లు చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. ప్ర‌భుత్వంలో కీల‌క నిర్ణ‌యాలు తీసుకోవ‌డంలో త‌మ పాత్ర త‌గ్గిపోవ‌డం, ఇత‌ర శ‌క్తుల అధికారం పెరిగిపోవ‌డం కార‌ణాలుగా చూపిస్తూ పెజెష్కియాన్ త‌న రాజీనామాను సుప్రీం నాయ‌కుడికి పంపిన‌ట్టు తెలుస్తోంది.

ఉద్రిక్తతల వేళ ఇరాన్‌కు భారీ దెబ్బ.. ప్రెసిడెంట్ పెజిష్కియాన్ రాజీనామా?
X

దిశ‌, వెబ్ డెస్క్: ఇరాన్ ప్రెసిడెంట్ పెజిష్కియాన్ రాజీమానా లేఖ‌ను స‌మ‌ర్పించిన‌ట్టు అంత‌ర్జాతీయ‌ మీడియాలో వార్త‌లు చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. ప్ర‌భుత్వంలో కీల‌క నిర్ణ‌యాలు తీసుకోవ‌డంలో త‌మ పాత్ర త‌గ్గిపోవ‌డం, ఇత‌ర శ‌క్తుల అధికారం పెరిగిపోవ‌డం కార‌ణాలుగా చూపిస్తూ పెజెష్కియాన్ త‌న రాజీనామాను సుప్రీం నాయ‌కుడికి పంపిన‌ట్టు తెలుస్తోంది. ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) లోని వారికి, దేశ వ్యవహారాలపై మరింత నియంత్రణను సాధించడానికి వీలు క‌ల్పించార‌ని పెజిష్క‌యాన్ త‌న రాజీనామాలో పేర్కొన్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. దీంతో ప్ర‌స్తుతం ఉన్న ప‌రిస్థితుల్లో ప్ర‌భుత్వాన్ని నిర్వ‌హించ‌డం త‌న వ‌ల్ల కాద‌ని, తాను త‌ప్పుకుంటాన‌ని స్ప‌ష్టం చేసిన‌ట్టు తెలుస్తోంది.

అయితే సుప్రీం లీడ‌ర్ కార్యాల‌యం మాత్రం పెజిష్కియాన్ రాజీనామా వార్త‌ల‌ను ఖండిస్తోంది. ఇది ఫారెన్ మీడియా ఆడుతున్న మైండ్ గేమ్ అని అధ్యక్షుడి రాజీనామా వార్తల్లో నిజం లేదని చెబుతోంది. విదేశీ మీడియా సంస్థ‌లు త‌ప్పుడు స‌మాచారం వ్యాప్తి చేస్తున్నాయ‌ని ఆరోపించింది. అంతే కాకుండా పెజెష్కియాన్ త‌న ప‌ద‌విలోనే కొన‌సాగుతున్నార‌ని, అధ్య‌క్ష బాధ్య‌త‌ల‌ను నిర్వ‌ర్తిస్తున్నార‌ని ఐఆర్ జీసీ అనుబంధ త‌స్నిమ్ న్యూస్ ఎజెన్సీ వివ‌రించింది. మ‌రోవైపు అధ్య‌క్ష కార్యాల‌యంలోని క‌మ్యూనికేష‌న్స్ అండ్ ఇన్ఫ‌ర్మేష‌న్ విభాగానికి డిప్యూటీ హెడ్ అయిన స‌య్య‌ద్ మెహ‌దీ త‌బాత‌బాయి.. అంత‌ర్జాతీయ మీడియాలో వ‌స్తున్న వార్త‌ల‌ను ఫేక్ వార్త‌లు అంటూ కొట్టిపారేశారు.

Next Story