పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్ యుద్ధం.. సీన్‌లోకి ఎంటరైన ఇరాన్

by Ajay Maddhiboyina |

పాకిస్థాన్, ఆఫ్ఘ‌నిస్థాన్ మ‌ధ్య యుద్ధం మొద‌లైంది. రెండు దేశాల మ‌ధ్య యుద్ధం జ‌రుగుతుంటే సీన్ లోకి ఇరాన్ ఎంట్రీ ఇచ్చింది.

పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్ యుద్ధం.. సీన్‌లోకి ఎంటరైన ఇరాన్
X

దిశ‌, వెబ్ డెస్క్: పాకిస్థాన్, ఆఫ్ఘ‌నిస్థాన్ మ‌ధ్య యుద్ధం మొద‌లైంది. పాకిస్థాన్ ర‌క్ష‌ణ మంత్రి తాలిబ‌న్ దేశంపై యుద్ధాన్ని అధికారికంగా ప్ర‌క‌టించారు. ఇరు దేశాలు ఒక‌దానిపై మ‌రొక‌టి దాడుల పాల్ప‌డుతున్నాయి. తాజాగా 133 మంది ఆఫ్ఘ‌న్ తాలిబ‌న్ కార్య‌క‌ర్త‌ల‌ను హ‌తమార్చిన‌ట్టు పాకిస్థాన్ తెలిపింది. త‌మ ఆర్మీ దాడిలో 133 మంది మ‌ర‌ణించ‌గా మ‌రో 200 మంది తాలిబ‌న్లు గాయ‌ప‌డ్డార‌ని పేర్కొంది. అంతే కాకుండా ఆఫ్ఘ‌నిస్థాన్ తాలిబ‌న్ పోస్టుల‌ను ధ్వంసం చేసిన‌ట్టు పాక్ తెలిపింది. మ‌రోవైపు పాకిస్థాన్ విమానాల‌ను కూల్చివేసిన‌ట్టు ఆఫ్ఘ‌నిస్థాన్ పేర్కొంది.

తాలిబ‌న్ ద‌ళాలు 19 చెక్ పోస్టుల‌ను స్వాధీనం చేసున్నాయ‌ని ప్ర‌క‌టించింది. 55మంది పాకిస్థానీ సైనికుల‌ను హ‌త‌మార్చార‌ని తెలిపింది. ఇక రెండు దేశాల మ‌ధ్య యుద్ధం జ‌రుగుతుంటే సీన్ లోకి ఇరాన్ ఎంట్రీ ఇచ్చింది. ఇస్లామిక్ రిప‌బ్లిక్ ఆఫ్ ఇరాన్ రెండు దేశాల మ‌ధ్య చ‌ర్చ‌లు సుల‌భ‌త‌రం చేయ‌డానికి, రెండు దేశాల మ‌ధ్య అవ‌గాహ‌న మ‌రియు స‌హకారం పెంపొందించ‌డానికి అవ‌స‌ర‌మైన స‌హాయం అందించేందుకు సిద్ధంగా ఉంద‌ని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరఘ్చి ఎక్స్ పోస్ట్ ద్వారా తెలిపారు.

Next Story