కంటికి కన్ను కాదు.. కంటికి తల తీస్తాం...అమెరికాకు ఇరాన్ హెచ్చ‌రిక‌

by velandi.Saikiran |   (  Updated:2026-03-25 09:28:47  IST  )

కంటికి కన్ను కాదు.. కంటికి తల తీస్తామంటూ ఇరాన్ IRGC జనరల్ మొహసిన్ రెజాయి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

కంటికి కన్ను కాదు.. కంటికి తల తీస్తాం...అమెరికాకు ఇరాన్ హెచ్చ‌రిక‌
X

దిశ‌, వెబ్ డెస్క్‌: ఇరాన్ వర్సెస్ అమెరికా, ఇజ్రాయెల్ మధ్య యుద్ధానికి తాత్కాలిక బ్రేక్ పడింది. ఈ మేరకు ఇప్పటికే ట్రంప్ నుంచి ప్రకటన వచ్చిన సంగతి తెలిసిందే. కానీ ఇరాన్ మాత్రం ఈ విషయంలో వెనక్కి తగ్గడం లేదు. తమను టార్గెట్ చేసిన అమెరికాను వదిలేది లేదంటూ పదే పదే వార్నింగులు ఇస్తోంది ఇరాన్. ఇక లేటెస్ట్ గా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ను ఉద్దేశించి మరో వార్నింగ్ ఇచ్చింది ఇరాన్.

కంటికి కన్ను కాదు.. కంటికి తల తీస్తామంటూ ఇరాన్ IRGC జనరల్ మొహసిన్ రెజాయి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. తమ స్థావరాలపై దాడులు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. అమెరికా షిప్పులను గల్ఫ్ లో ముంచేస్తామని వార్నింగ్ ఇచ్చారు. ఆంక్షలు ఎత్తేసి, నష్ట పరిహారం చెల్లిస్తేనే ఘర్షణలు ఆగుతాయని స్పష్టం చేశారు. అమెరికాను కాపాడుకునేందుకు ఎక్కువ సమయం లేదని కూడా కుండబద్దలు కొట్టారు. దీంతో ఇరాన్ IRGC జనరల్ మొహసిన్ రెజాయి చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. మ‌రి దీనిపై అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

ట్రంప్ విరామానికి తూట్లు..ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఆగని పోరు

Next Story