ఇరాన్ లో తొమ్మిది న్యూక్లియర్ బాంబులు రెడీ? ఆగమేఘాల మీద ఇజ్రాయిల్ దాడి

by Shamantha N |

ఇజ్రాయిల్ పై హమాస్ దాడి చేసిన గతేడాదిలో ఇజ్రాయిల్ ఫోకస్ గాజా, హమాస్ పై ఉండగా... ఆ సమయంలో యూరేనియం, న్యూక్లియర్ బాంబుల తయారీని ఇరాన్ వేగవంతం చేసింది.

ఇరాన్ లో తొమ్మిది న్యూక్లియర్ బాంబులు రెడీ? ఆగమేఘాల మీద ఇజ్రాయిల్ దాడి
X

దిశ, నేషనల్ బ్యూరో: ఇజ్రాయిల్ పై హమాస్ దాడి చేసిన గతేడాదిలో ఇజ్రాయిల్ ఫోకస్ గాజా, హమాస్ పై ఉండగా... ఆ సమయంలో యూరేనియం, న్యూక్లియర్ బాంబుల తయారీని ఇరాన్ వేగవంతం చేసింది. ఈ మధ్య ఇజ్రాయిల్ నిఘా విభాగం ఇరాన్ అతి త్వరలో న్యూక్లియర్ బాంబులు రెడీ చేయడానికి సిద్ధమైనట్లు గుర్తించి ఆగమేఘాల మీద ఇరాన్ అణ్వస్త్ర ప్లాంట్లపై దాడి చేస్తోంది. ఇరాన్ లోని సైంటిస్టులను, ముఖ్యమైన వ్యక్తులను యూరేనియం శుద్ధి కేంద్రాలపై దాడులకు తెగబడుతోంది. అత్యంత కచ్చితత్వమైన ఇన్ఫర్మేషన్ అందడంతోనే ఇరాన్ పై ఇజ్రాయిల్ దాడికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఒక వేళ ఇరాన్ అణ్వస్త్ర బాంబులను తయారు చేస్తే మొదటగా ఇజ్రాయిల్ పైనే వాటిని ప్రయోగించే అవకాశం ఉంది. అందుకే ముందు జాగ్రత్తగా అణ్వస్త్ర తయారీ ప్లాంట్లు, యూరేనియం శుద్ధి నిల్వలు, ప్రముఖ అణు సైంటిస్టులను ఇజ్రాయిల్ మట్టుబెడుతోంది.

మరికొన్ని వారాల్లో అణుబాంబులు రెడీ?

ఇరాన్ తలుచుకుంటే మరి కొన్నివారాల్లోనే అణుబాంబును తయారు చేయగల సమర్థతకు వచ్చిందని ‘టైమ్స్‌ ఆఫ్‌ ఇజ్రాయెల్‌’ కథనంలో పేర్కొంది. దీని కోసం ఇరాన్ కొన్ని గ్రూపులను రెడీ చేసిందని ఇది ఇజ్రాయిల్ అస్తిత్వానికి ముప్పుగా పరిగణించి దాడులన ముమ్మరం చేసినట్లు తెలిపింది. మేలో అటామిక్‌ ఎనర్జీ సంస్థ నివేదిక ప్రకారం యూరేనియం శుద్ధి చేస్తే దాదాపు ఇరాన్ 9 అణు బాంబుల్ని తయారు చేసే శక్తి వస్తుంది. అది కూడా అతి త్వరలోనే చివరి దశకు ప్రయోగాలు చేరుకున్నట్లు అత్యంత విశ్వసనీయ వర్గాల ద్వారా ఇజ్రాయిల్ సమాచారం సేకరించింది. దీంతో పక్కా ప్లాన్ తో అణ్వస్త్ర తయారీ ప్లాంట్ల వద్దే దాడులు చేస్తోంది. ఈ క్రమంలో ఇజ్రాయిల్ తొలిదాడిలోనే ఇరాన్ న్యూక్లియర్ సైంటిస్టులను చంపింది. ఆ తర్వాత ముఖ్య నేతలను టార్గెట్ చేసుకుని దాడులు కొనసాగిస్తుంది. ఈ విషయాన్ని తెలుసుకోవడానికి ఇజ్రాయిల్ కోవర్గులు కొన్ని సంవత్సరాలుగా అహర్నిశలు పనిచేస్తున్నాయి. మొస్సాద్‌ ఏజెంట్లు అందించిన సమాచారంతో అత్యంత కచ్చితత్వంతో పనిచేసే ఆయుధాలతో శుక్రవారం ఉదయం ఇజ్రాయెల్‌ శ్రేణులు దాడులు చేశాయి. వీటిల్లో బాంబులు జారవిడిచే క్వాడ్‌కాప్టర్‌ డ్రోన్లు, రాకెట్లు ఉన్నాయి. ఇవి ఇరాన్‌ అణుశాస్త్రవేత్తలు, ఇరాన్‌ టాప్‌మిలిటరీ జనరల్స్‌, యాంటీ ఎయిర్‌ క్రాఫ్ట్‌ బ్యాటరీలను లక్ష్యంగా చేసుకొన్నాయి.

Next Story