భారత్‎కు బిగ్ రిలీఫ్..మ‌రో రెండు నౌకలకు ఇరాన్​ అనుమతి !

by velandi.Saikiran |

భారత్‎కు బిగ్ రిలీఫ్ ద‌క్కింది. హార్ముజ్ జలసంధి గుండా రెండు భారతీయ నౌక‌ల‌కు ఇరాన్ అనుమ‌తి ఇచ్చింద‌ని స‌మాచారం.

భారత్‎కు బిగ్ రిలీఫ్..మ‌రో రెండు నౌకలకు ఇరాన్​ అనుమతి !
X

దిశ, వెబ్ డెస్క్‌: మిడిల్ ఈస్ట్ దేశాలలో యుద్ధం వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. దీని వల్ల మన భారతదేశంలో LPG కొరత స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో ఇండియాలోనే 25% ఉత్పత్తిని పెంచాలని మోడీ సర్కార్ నిర్ణయం తీసుకుంది. అయినప్పటికీ దిగుమతి చేసుకుంటేనే మన ఇండియాలో కొరత తగ్గుతుంది. ఇలాంటి నేపథ్యంలోనే భారత్ కు బిగ్ రిలీఫ్ ఇచ్చింది ఇరాన్. హర్ముజ్ జలసంధి ( Hormuz) గుండా రెండు భారతీయ LPG నౌకలు ప్రయాణించేందుకు ఇరాన్ సర్కార్ అనుమతి ఇచ్చినట్లు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. భారతీయ జెండాలతో ఈ రెండు భారీ నౌకలు ( LPG carriers) వెళ్లాలని ఇరాన్ (Iran) కండిషన్ పెట్టిందని అంటున్నారు.

మ‌రో రెండు నౌక‌ల‌కు ఇరాన్ గ్రీన్ సిగ్న‌ల్

ఇండియాలో LPG కొరత ఉన్న నేపథ్యంలో తాజాగా ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ తో భారత విదేశాంగ మంత్రి S. జై శంకర్ చర్చలు జరిపారు. ఈ సందర్భంగా చర్చలు సఫలం కావడంతో రెండు భారీ నౌకలకు ఇరాన్ అనుమతి ఇచ్చినట్లు చెబుతున్నారు. ఇప్పటికే శివాలిక్ అనే 40,000 మెట్రిక్ టన్నుల ఎల్పీజీ నౌక భారత తీరానికి బయలుదేరింది. లేటెస్ట్ గా మరో రెండు నౌకలకు పర్మిషన్ ఇచ్చారని తెలుస్తోంది. పుష్పక్, పరిమల్ అనే రెండు భారీ ఎల్పీజీ నౌకలకు హర్ముజ్ జలసంధి గుండా ప్రయాణించేందుకు ఇరాన్ సర్కార్ అనుమతి ఇచ్చినట్లు కథనాలు వస్తున్నాయి. ఈ రెండు నౌకలు భారతదేశానికి చేరితే కొరత కాస్తయినా తగ్గే ఛాన్స్ ఉంది. ఇక ఈ న్యూస్ వైరల్ అయిన నేపథ్యంలో మోడీ ప్రభుత్వాన్ని నెటిజెన్స్ మెచ్చుకుంటున్నారు. యుద్ధం సమయంలో కూడా ఇరాన్ తో చర్చలు జరిపి ఎల్పీజీ నౌకలను తీసుకురావడం గొప్పతనమే అంటున్నారు.

Next Story