ఇంకా దాడులు చేయండి..ట్రంప్ ను కోరిన‌ ఇరాన్ మాజీ యువరాజు!

by velandi.Saikiran |

అమెరికా, ఇజ్రాయెల్ దాడులను ఇరాన్ మాజీ యువరాజు రెజా పహ్లావి సమర్థించి అందరికీ షాక్ ఇచ్చాడు.

ఇంకా దాడులు చేయండి..ట్రంప్ ను కోరిన‌ ఇరాన్ మాజీ యువరాజు!
X

దిశ‌, వెబ్ డెస్క్‌: ఇరాన్ వర్సెస్ అమెరికా, ఇజ్రాయెల్ మధ్య వార్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. 20 రోజులకు పైగా యుద్ధం కొనసాగుతోంది. ఈ యుద్ధంలో ఇరాన్ చాలా నష్టపోయినప్పటికీ, ఏ మాత్రం తగ్గడం లేదు. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతి చెందినప్పటికీ కూడా ఏ మాత్రం వెనకడుగు వేయడం లేదు ఇరాన్. అయితే ఈ నేపథ్యంలో ఇరాన్ పై మాజీ యువరాజ్ రెజా పహ్లావి ( Reza Pahlavi) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

అమెరికా, ఇజ్రాయెల్ దాడులను స‌మ‌ర్థించిన రెజా పహ్లావి

అమెరికా, ఇజ్రాయెల్ దాడులను ఇరాన్ మాజీ యువరాజు రెజా పహ్లావి సమర్థించి అందరికీ షాక్ ఇచ్చాడు. ఇరాన్ ఇస్లామిక్ రెజిమీ సొంతం కాదని మండిపడ్డారు. ఇరాన్ మౌలిక వసతులపై ప్రజలకే హక్కు ఉంటుందని వివరించారు మాజీ యువరాజు రెజా పహ్లావి. ఇరాన్ దేశాన్ని కాపాడేందుకు ప్రస్తుత ప్రభుత్వాన్ని కచ్చితంగా అంతం చేయాలని కోరారు. పౌరులను మినహాయిస్తూ ఇరాన్ సర్కార్ పై దాడులు కొనసాగించాలని అమెరికా, ఇజ్రాయెల్ దేశాలను కోరారు మాజీ యువరాజు రెజా పహ్లావి. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం అమెరికాలోనే రెజా పహ్లావి ఉంటున్న సంగతి తెలిసిందే.

Next Story