- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇజ్రాయెల్ పై ఇరాన్ క్లస్టర్ బాంబులు..దద్దరిల్లిన ప్రధాన నగరాలు
ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య వార్ జరుగుతున్న సంగతి తెలిసిందే. 8 రోజులుగా యుద్ధం జరుగుతుండగా ఇరు దేశాలు రెచ్చిపోతున్నాయి. గురువారం రాత్రి ఇజ్రాాయెల్ పై ఇరాన్ విరుచుకుపడింది.

దిశ, వెబ్ డెస్క్: ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య వార్ జరుగుతున్న సంగతి తెలిసిందే. 8 రోజులుగా యుద్ధం జరుగుతుండగా ఇరు దేశాలు రెచ్చిపోతున్నాయి. గురువారం రాత్రి ఇజ్రాాయెల్ పై ఇరాన్ విరుచుకుపడింది. క్లస్టర్ బాంబులతో ప్రధాన నగరాలపై దాడికి దిగింది. తమపై ఇరాన్ క్లస్టర్ బాంబులతో దాడి చేసిందని టెల్ అవీవ్ దళాలు స్పష్టం చేశాయి. ఈ క్షిపణి వార్ హెడ్ 7 కిలోమీటర్ల ఎత్తులో పేలి 20 మందు గుండు సామాగ్రిగా మారి పలు ప్రాంతాల్లో పడ్డాయని తెలిపింది.
ఇతర బాలిస్టిక్ క్షిపణుల కంటే క్లస్టర్‌లు ప్రమాద తీవ్రతను పెంచుతాయని పేర్కొంది. టెల్ అవీవ్‌తో పాటు ఇజ్రాయెల్‌లోని ప్రధాన నగరాలు అయిన జెరూసలెం, హైఫా నగరాలపై సైతం ఇరాన్ క్లస్టర్ దాడులు చేసినట్టు తెలుస్తోంది. బీర్ షెబాలోని సోరోకా ఆస్పత్రిపై కూడా ఇరాన్ దాడి చేసింది. దాడులతో ఇజ్రాయెల్ వ్యాప్తంగా సైరన్లు మోగినట్టు సమాచారం. ఇదిలా ఉంటే ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీనే అంతం చేస్తామని ఇజ్రాయెల్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఇప్పటికే చాలా మంది ఇరాన్ ముఖ్యనేతలు కన్నూశారు. ఇటీవల ఖమేనీ నివాసానికి దగ్గరలోనే ఇజ్రాయెల్ బాంబు దాడి చేసింది.






