బంగ్లాదేశ్‌లో మళ్లీ మొదలైన రణరంగం.. రోడ్లపైకి ‘ఇంక్విలాబ్’ ఆందోళనకారులు

by Ramesh Naini |

: మాజీ ప్రధాని షేక్ హసీనా వ్యతిరేక ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన యువ నాయకుడు ఉస్మాన్ హాదీ (షరీఫ్ ఉస్మాన్ బిన్ హాదీ) హత్యకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ బంగ్లాదేశ్ రాజధాని ఢాకా శుక్రవారం అట్టుడికింది.

బంగ్లాదేశ్‌లో మళ్లీ మొదలైన రణరంగం.. రోడ్లపైకి ‘ఇంక్విలాబ్’ ఆందోళనకారులు
X

దిశ, డైనమిక్ బ్యూరో: మాజీ ప్రధాని షేక్ హసీనా వ్యతిరేక ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన యువ నాయకుడు ఉస్మాన్ హాదీ (షరీఫ్ ఉస్మాన్ బిన్ హాదీ) హత్యకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ బంగ్లాదేశ్ రాజధాని ఢాకా శుక్రవారం అట్టుడికింది. ‘ఇంక్విలాబ్ మంచ్’ ఆధ్వర్యంలో జరిగిన నిరసన ప్రదర్శన ఉద్రిక్తంగా మారింది. డిసెంబర్ 18న హత్యకు గురైన ఉస్మాన్ హాదీ మృతికి కారకులైన వారిని అరెస్టు చేయడంలో జాప్యం జరుగుతోందంటూ మరోసారి వేలాది మంది ఆందోళనకారులు రోడ్లపైకి వచ్చారు.

షాబాగ్ కూడలి దిగ్బంధం

శుక్రవారం జుమ్మా ప్రార్థనల అనంతరం ‘ఇంక్విలాబ్ మంచ్’ పిలుపు మేరకు వివిధ వర్గాల ప్రజలు ఢాకాలోని షాబాగ్ కూడలిని దిగ్బంధించారు. నిందితులను కఠినంగా శిక్షించాలని నినాదాలు చేస్తూ, జమున సమీపంలోని ప్రధాన సలహాదారు కార్యాలయం (చీఫ్ అడ్వైజరీ ఆఫీస్) వైపు ర్యాలీగా వెళ్లేందుకు ప్రయత్నించారు. ర్యాలీని అడ్డుకునేందుకు పోలీసులు భారీ ఎత్తున బారికేడ్లను ఏర్పాటు చేశారు. ఆందోళనకారులు వాటిని దాటేందుకు ప్రయత్నించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. నిరసనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు వాటర్ ట్యాంకులు (Water Cannons), బాష్పవాయువు (Tear Gas), సౌండ్ గ్రనేడ్లను ప్రయోగించారు. ఈ సందర్భంగా ఇంక్విలాబ్ మంచ్ సభ్య కార్యదర్శి అబ్దుల్లా అల్ జాబెర్ మాట్లాడుతూ.. ‘ఉస్మాన్ హాదీ ఆశయాలను మేము ముందుకు తీసుకెళ్తాము. హంతకులను చట్టం ముందు నిలబెట్టే వరకు మా ఉద్యమం ఆగదు, వీధుల్లోనే ఉంటాం’ అని ఆయన హెచ్చరించారు.

Next Story