- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Iran War : యుద్ధ మేఘాల మధ్య అమాయకత్వం.. ఇరాన్‌లో కదిలిస్తున్న దృశ్యాలు
ఇరాన్‌లో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల మధ్య గుండెల్ని పిండేసే ఒక దృశ్యం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

దిశ, డైనమిక్ బ్యూరో: ఇరాన్‌లో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల మధ్య గుండెల్ని పిండేసే ఒక దృశ్యం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అమెరికా-ఇజ్రాయెల్ దాడుల కారణంగా హార్ముజ్ జలసంధి సమీపంలోని బందర్ అబ్బాస్ నావల్ బేస్ వద్ద దట్టమైన నల్లటి పొగలు కమ్ముకుంటున్నా.. అక్కడికి సమీపంలోని బీచ్‌లో ఓ చిన్నారి ఏమాత్రం బెదరకుండా సంతోషంగా ఊయల ఊగుతున్న వీడియో అందరినీ కదిలిస్తోంది. భయంకరమైన యుద్ధ వాతావరణానికి, చిన్నారి అమాయకత్వానికి ఈ దృశ్యం అద్దం పడుతోంది.
12 ఏళ్లు నిండిన పిల్లలను కూడా..
ఇదిలా ఉండగా, ఇరాన్ ప్రభుత్వం తీసుకున్న మరో నిర్ణయం తీవ్ర ఆందోళన రేకెత్తిస్తోంది. 12 ఏళ్లు నిండిన పిల్లలను కూడా యుద్ధ సంబంధిత సహాయక (పెట్రోలింగ్, చెక్‌పోస్టులు, లాజిస్టిక్స్) చర్యల్లో పాల్గొనేందుకు ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) అనుమతించిందని జాతీయ మీడియా స్పష్టం చేస్తోంది. ‘ఫర్ ఇరాన్’ పేరిట ఈ నియామకాలు చేపడుతున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ మనుగడ కోసం పిల్లలను ప్రమాదంలోకి నెడుతున్నారని ఇరాన్ పాత్రికేయురాలు మసీహ్ అలీ నెజాద్ ఈ నిర్ణయాన్ని తీవ్రంగా ఖండించారు.
పిల్లలపై చూపుతున్న యుద్ధ ప్రభావం
యుద్ధం పిల్లలపై చూపుతున్న ప్రభావం అత్యంత ఘోరంగా ఉంది. ఈ యుద్ధం ప్రారంభ దశలో మినాబ్ నగరంలోని ఓ బాలికల ప్రాథమిక పాఠశాలపై జరిగిన వైమానిక దాడిలో ఏకంగా 165 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. శిథిలాల కింద చిక్కుకున్న పసి మృతదేహాలు, వారి స్కూల్ బ్యాగులు, వరుసగా తవ్విన చిన్నారి సమాధులు.. అమాయక పౌరులపై యుద్ధం మిగిల్చిన తీరని విషాదం ప్రస్తుతం నెటిజన్‌లు గుర్తు చేసుకుంటున్నారు.






