అంత‌ర్జాతీయ వేదిక‌పై స‌త్తాచాటిన ఇండియ‌న్ విస్కీ "ఇంద్రి" .. నంబ‌ర్ వ‌న్ బ్రాండ్‌గా గుర్తింపు

by Ajay Maddhiboyina |

అంతర్జాతీయ వేదికపై ఇండియన్ విస్కీ బ్రాండ్ ఇంద్రి (indri) సత్తాచాటింది. లాస్ వెగాస్ గ్లోబల్ స్పిరిట్ అవార్డ్స్ (global spirit awards)లో బెస్ట్ వరల్డ్ విస్కీగా అవార్డును సొంతం చేసుకుంది. లాస్ వెగాస్ లో గ్లోబల్ స్పిరిట్స్ అవార్డ్స్ 2025 కార్యక్రమం జరగ్గా ఫైనల్స్ లో ఐదు విస్కీ బ్రాండ్‌లు నిలిచాయి.

అంత‌ర్జాతీయ వేదిక‌పై స‌త్తాచాటిన ఇండియ‌న్ విస్కీ ఇంద్రి .. నంబ‌ర్ వ‌న్ బ్రాండ్‌గా గుర్తింపు
X

దిశ, వెబ్ డెస్క్: అంతర్జాతీయ వేదికపై ఇండియన్ విస్కీ బ్రాండ్ ఇంద్రి (indri) సత్తాచాటింది. లాస్ వెగాస్ గ్లోబల్ స్పిరిట్ అవార్డ్స్ (global spirit awards)లో బెస్ట్ వరల్డ్ విస్కీగా అవార్డును సొంతం చేసుకుంది. లాస్ వెగాస్ లో గ్లోబల్ స్పిరిట్స్ అవార్డ్స్ 2025 కార్యక్రమం జరగ్గా ఫైనల్స్ లో ఐదు విస్కీ బ్రాండ్‌లు నిలిచాయి. వీటిలో నాలుగు భారతీయ విస్కీలే ఉండటం విశేషం. ఇక ఇందులో 99.1 పాయింట్లతో ప్రపంచ బెస్ట్ విస్కీగా నిలిచి ఇంద్రి గౌరవం పొందింది. గ్లోబల్ స్పిరిట్స్ అవార్డ్స్ పోటీని లాస్ వెగాస్ కు చెందిన ఓ విస్కీ పరిశ్రమ నిర్వహిస్తుంది.

ఇందులో అనుభవం ఉన్న న్యాయనిర్ణేతల బృందం బ్లైండ్ టేస్టింగ్ ద్వారా స్పిరిట్ అంచనా వేస్తారు. పోటీల్లో 100 పాయింట్ల‌ను ప్రామాణికంగా తీసుకుంటారు. పోటీల్లో గెలిచిన బ్రాండ్ల‌కు ప్లాటినం, గోల్డ్, సిల్వ‌ర్, కాంస్య ప‌థ‌కాలు ఇస్తారు. ఈ పోటీల్లో ఇంద్రి గెల‌వ‌డం విశేషం. ఇక ఈ బ్రాండ్ విష‌యానికి వ‌స్తే.. హ‌ర్యానాలోని ఇంద్రీలోని పికాడిలీ డిస్టిల‌రీస్ సాంప్ర‌దాయ రాగి కుండ స్టిల్స్ ఉప‌యోగించి బార్లీ నుండి దీనిని త‌యారు చేస్తారు.

2021లో దీనిని ప్రారంభించ‌గా ఇందులో క్యాండీడ్ ఆరెంజ్, ఆప్రికాట్, బంగారు రంగు ద్రాక్ష‌, వెనిల్లా, హ‌నీ, రుచికర ఓక్ సువాసనలు ఉంటాయి. ఈ విస్కీ చాలా లైట్ గా తియ్యగా టేస్టీగా ఉంటుంది. 2023లో కూడా గ్లోబల్ విస్కీ-టేస్టింగ్ పోటీ ‘విస్కీస్ ఆఫ్ ది వరల్డ్ అవార్డ్స్‌’లో ‘ఇంద్రి దీపావళి కలెక్టర్స్ ఎడిషన్ 2023’ ఫస్ట్ ప్లేస్‌లో నిలిచింది. ప్రపంచ వ్యాప్తంగా దీనిని ఇష్టపడే మద్యం ప్రియులు ఎక్కువగానే ఉన్నట్టు తెలుస్తోంది. ఇండియాలో 750ml బాటిల్ ధర సుమారుగా రూ.5వేల నుండి రూ.6,500 వరకు ఉంటుంది.

Next Story