- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రపంచ టెలికాం రంగంలో భారత్ దే పెద్దన్న పాత్ర: జ్యోతిరాధిత్య సింధియా
ప్రపంచ టెలికాం రంగంలో భారత్ గ్లోబల్ లో పెద్దన్న పాత్ర పోషిస్తుందని కేంద్ర టెలికాం శాఖ మంత్రి జ్యోతిరాధిత్య సింధియా అన్నారు.

దిశ, నేషనల్ బ్యూరో: ప్రపంచ టెలికాం రంగంలో భారత్ గ్లోబల్ లో పెద్దన్న పాత్ర పోషిస్తుందని కేంద్ర టెలికాం శాఖ మంత్రి జ్యోతిరాధిత్య సింధియా అన్నారు. సాంకేతిక రంగంలో భారతదేశ పురోగతిపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేసిన విమర్శలకు కౌంటర్‌గా మంత్రి జ్యోతిరాదిత్య సింధియా సోషల్ మీడియా వేదికగా ‘ఎక్స్’ లో స్పందించారు. డిజిటల్ ఇండియా కార్యక్రమంపై తప్పుదోవ పట్టించే ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు. (BSNL) బీఎస్ఎన్ఎల్ 18 ఏళ్ల తర్వాత లాభాల్లోకి వచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. 2 లక్షల గ్రామ పంచాయతీలను బ్రాడ్‌బ్యాండ్‌తో అనుసంధానం చేసిన ఘనతను ఆయన తెలుసుకోవాలన్నారు.
టెలికాం స్కామ్ అంటే కాంగ్రెస్ గుర్తుకొస్తుంది
‘ఇండియాలో టెలికాం స్కామ్స్’ అని వెబ్‌లో ఒక్కసారి సెర్చ్ చేయండి. అక్కడ కనిపించేది కాంగ్రెస్, యూపీఏ ప్రభుత్వం చేసిన అవినీతి ఘనచరిత్ర కనిపిస్తుందని మల్లికార్జున ఖర్గేకు సింధియా కౌంటర్ ఇచ్చారు. ఈ రోజు వరల్డ్ లో భారత్‌ను టెలికాం, 5జీ, శాటిలైట్ కనెక్టివిటీ రంగాల్లో ప్రపంచ నాయకుడిగా చూస్తోందన్నారు. ఇది మోడీ ప్రభుత్వ సంస్కరణల వల్ల సాధ్యమైందని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పాలనలో జరిగిన గందరగోళాన్ని సరిదిద్దడమే మోడీ ప్రభుత్వ విజయానికి గల అసలైన కారణమన్నారు. డిజిటల్ పేమెంట్ల వల్ల దేశంలో లక్షల కోట్లు ఆదా అవుతున్నాయన్నారు. వివిధ వ్యాపారాలు చేసే సమయంలో దళారుల ప్రమేయం తొలగిపోయిందన్నారు. డిజిటల్ పేమెంట్ల వల్ల రూ. 3.48 లక్షల కోట్ల డబ్బు అవుతుందని చెప్పారు. ప్రపంచంలో జరిగే డిజిటల్ పేమెంట్లలో దేశంలోనే 50 శాతం పైగా జరుగుతున్నాయని తెలిపారు.
గొప్పలు చెప్పడం ఆపి వాగ్దానాలు నెరవేర్చాలి
కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు డిజిటల్ ఇండియా వల్ల సైబర్ నేరాల పెరుగుదల, డేటా పరిరక్షణ చట్టం ద్వారా (RTI) బలహీనపరచడంపై విమర్శలు చేశారు. కాగా దేశంలో ఇంకా 65 శాతం గ్రామాలకు బ్రాడ్ బ్యాండ్ సేవలు ప్రారంభం కాలేవని, సైబర్ నేరాలు లెక్కలేనన్నీ పెరిగిపోయాయని విమర్శించారు. గొప్పలు చెప్పడం మాని వాగ్దానాలు నెరవేర్చాలని బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.






