బిగ్ రిలీఫ్‌..గ‌ల్ఫ్ దేశాల నుంచి తిరిగివ‌చ్చేస్తోన్న ఇండియ‌న్స్‌

by velandi.Saikiran |   (  Updated:2026-03-02 20:06:08  IST  )

గల్ఫ్ దేశాలలో చిక్కుకున్న భారతీయులు తిరిగి వ‌స్తున్నారు. అబుదాబి నుంచి ఢిల్లీకి, బెంగళూరుకు విమానాలు చేరుకున్నాయి.

బిగ్ రిలీఫ్‌..గ‌ల్ఫ్ దేశాల నుంచి తిరిగివ‌చ్చేస్తోన్న ఇండియ‌న్స్‌
X

దిశ‌, వెబ్ డెస్క్‌: ఇరాన్ దాడుల నేపద్యంలో విమాన సేవలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. గల్ఫ్ దేశాలలో ఉన్న విమానాశ్రయాలను పూర్తిగా మూసివేశారు. అయితే సోమవారం సాయంత్రం నుంచి విమాన సేవలు క్రమక్రమంగా పునరుద్ధరిస్తున్నారు. ఈ నేపథ్యంలో గల్ఫ్ దేశాలలో చిక్కుకున్న భారతీయులు తిరిగి వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే అబుదాబి నుంచి ఢిల్లీకి, అదే సమయంలో బెంగళూరుకు విమానాలు చేరుకున్నాయి.

గల్ఫ్ నుంచి తిరిగొస్తున్న భారతీయులు

దుబాయ్ నుంచి కూడా ఒక విమానం బయలుదేరింది. సాధారణ రోజుల తరహా లాగా కాకుండా కొన్ని కొన్ని విమానాలను పంపిస్తున్నారు. యుద్ధం తీవ్రత కాస్త తగ్గిన నేపథ్యంలో విమానాలు షురూ అయ్యాయి. అయితే ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే, పూర్తిస్థాయిలో విమానాలు పునః ప్రారంభం అవుతాయని అంటున్నారు. ఒకవేళ మళ్లీ యుద్ధం ఉద్రిక్తత ఎక్కువైతే, మళ్లీ విమానాలు ఆగిపోతాయి.

ఇది ఇలా ఉండగా అక్కడికి గగనతల స్థితిని పర్యవేక్షించనున్నట్లు కేంద్రం కీలక ప్రకటన చేసింది. ఇక లేటెస్ట్ గా భారతీయుల కోసం ఇండిగో, ఏకంగా 10 రిలీఫ్ విమానాలు నడపనున్నట్లు ప్రకటన చేసింది. ఇది ఇలా ఉండ‌గా, ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ భార్య మృతి చెందారు. ఇటీవల జరిగిన దాడుల్లో ఖమేనీ మృతి చెందగా తీవ్రంగా గాయపడిన‌ ఆయన భార్య తాజాగా మ‌ర‌ణించారు. చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వెల్లడించింది ఇరాన్ మీడియా.

Next Story