- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అబుదాబిలో దారుణం.. భారత యువతిపై గ్యాంగ్ రేప్.. సంచలనం రేపుతున్న ఘటన
యుఎఈలో దారుణం చోటు చేసుకుంది. భారత యువతిపై సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు ఐదుగురు దుర్మార్గులు. అబుదాబిలోని మెక్‌డొనాల్డ్స్‌లో పని చేస్తున్న ముంబైకి చెందిన 24ఏళ్ల యువతిపై.. అక్కడే పని చేసే నేపాల్, ఇండోనేషియాకు చెందిన

దిశ, వెబ్ డెస్క్ : యుఎఈలో దారుణం చోటు చేసుకుంది. భారత యువతిపై సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు ఐదుగురు దుర్మార్గులు. అబుదాబిలోని మెక్‌డొనాల్డ్స్‌లో పని చేస్తున్న ముంబైకి చెందిన 24ఏళ్ల యువతిపై.. అక్కడే పని చేసే నేపాల్, ఇండోనేషియాకు చెందిన ఐదుగురు సహోద్యోగులు గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారు. తీవ్ర రక్తస్రావంతో బాధపడుతున్న అమ్మాయిని అబూ దాభీలో ఆస్పత్రిలో చేర్పించిన తర్వాత ముంబైకి తరలించారు. అనంతరం వెర్సోవా పోలీస్ స్టేషన్‌లో బాధితురాలి తల్లి ఫిర్యాదు చేసింది.
అయితే ఈ కేసు అధికార పరిధి సంబంధిత సందేహాలను రేకెత్తిస్తుంది. ఎందుకంటే యుఎఈ చట్టాలు లైంగిక నేరాలకు కఠిన శిక్షలు విధిస్తాయి. అక్కడ రేప్ రేటు 1.5( ప్రతి 100,000 మహిళలకు) మాత్రమే. కాగా యుఎఈలో కాకుండా భారతదేశంలో కేసు నమోదు చేయడంపై జనాలు ఆసక్తి ఎక్కువైంది. చట్టపరమైన సంక్లిష్టతలపై చర్చకు దారితీసింది. యుఎఈలోని కఠిన చట్టాలు, తప్పుడు ఆరోపణలకు శిక్షలతో పోలిస్తే.. భారతదేశం తన పౌరులకు విదేశాల్లో సులభంగా చట్టపరమైన మద్దతు అందిస్తుంది. 2020లో భారత పీనల్ కోడ్‌లో చేసిన సవరణల ద్వారా కొన్ని నేరాలకు అంతర్జాతీయ అధికార పరిధి అనుమతించబడింది.






