- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అమెరికాలో హైదరాబాద్ యువతి హత్య.. భారత్‌లో నిందితుడు అరెస్ట్
జనవరి 3న అమెరికాలోని మేరీల్యాండ్ లో హైదరాబాద్ కు చెందిన యువతి గోడిశాల నికిత (27) హత్యకు గురైంది.

దిశ, వెబ్‌డెస్క్: జనవరి 3న అమెరికాలోని మేరీల్యాండ్ లో హైదరాబాద్ కు చెందిన యువతి గోడిశాల నికిత (27) హత్యకు గురైంది. ఈ కేసులో ఇంటర్ పోల్ పోలీసులు ఆమె మాజీ ప్రియుడు అర్జున్ శర్మను సోమవారం తమిళనాడులో అరెస్ట్ చేశారు. డిసెంబర్ 31 నుంచి నికితరావు కనిపించలేదు. జనవరి 3న అర్జున్ శర్మ అపార్ట్ మెంట్లో ఆమె మృతదేహాన్ని అక్కడి పోలీసులు గుర్తించారు. కాగా.. జనవరి 2న అర్జున్ శర్మ నికిత మిస్సింగ్ పై పోలీసులను ఆశ్రయించాడు. హోవార్డ్ కౌంటీ పోలీసులకు నికిత మిస్సింగ్ పై కంప్లైంట్ చేశాడు. చివరిగా ఆమెను న్యూ ఇయర్ రోజున చూసినట్లు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. అదేరోజున అతను ఇండియాకు వచ్చాడు. దీంతో పోలీసులకు అర్జున్ పై అనుమానం కలిగింది. అతని అపార్ట్మెంట్ లో తనిఖీ చేయగా జనవరి 3న నికిత మృతదేహం లభ్యమైంది. ఈ కేసులో అతడిని అనుమానితుడిగా చేర్చారు. ఆపై అరెస్ట్ వారెంట్ జారీ చేశారు.
కానీ.. అర్జున్ అమెరికాలో లేకపోవడంతో అతని ఆచూకీ కోసం యూఎస్ ఫెడరల్ ఏజెన్సీలు భారత్ అధికారులను సంప్రదించాయి. ఈ క్రమంలో ఇంటెలిజెన్స్ అధికారుల నుంచి అందిన సమాచారంతో ఇంటర్ పోల్ పోలీసులు తమిళనాడులో అర్జున్ ను అరెస్ట్ చేశారు. అతడిని అమెరికా పోలీసులకు అప్పగించేందుకు భారత్ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా.. గోడిశాల నికిత 2025 ఫిబ్రవరి నుంచి వేదా హెల్త్ లో డేటా అండ్ స్ట్రాటజీ అనలిస్ట్ గా పనిచేస్తుంది. మేరీల్యాండ్ లోని ఎల్లికాట్ సిటీలో స్థిరపడింది. ఇటీవలే ఆమె కంపెనీ నుంచి ఆల్ ఇన్ అవార్డు అందుకున్నట్లుగా కుటుంబ సభ్యులు తెలిపారు.






