హార్ముజ్ వద్ద భారత నౌకలకు ఛార్జీ లేదు.. కేంద్రం ప్ర‌క‌ట‌న‌

by velandi.Saikiran |

ఇరాన్ - అమెరికా మ‌ధ్య యుద్ధం కొన‌సాగుతోంది. ఈ క్ర‌మంలో హార్ముజ్ వద్ద భారత నౌకలకు ఛార్జీ లేదని కేంద్రం ప్ర‌క‌టించింది.

హార్ముజ్ వద్ద భారత నౌకలకు ఛార్జీ లేదు.. కేంద్రం ప్ర‌క‌ట‌న‌
X

దిశ‌, వెబ్ డెస్క్: ఇరాన్, ఇజ్రాయెల్ -అమెరికా దేశాల మధ్య యుద్ధం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ క్రమంలో కేంద్రం కీలక ప్రకటన చేసింది. హర్మూజ్ జలసంధి వద్ద ఇండియాకు సంబంధించిన నౌకలకు ఇరాన్ అనుమతులు ఇస్తోందని వెల్లడించింది కేంద్ర ప్రభుత్వం. ఈ హర్మూజ్ జలసంధి దగ్గర ఎలాంటి ఛార్జీలు ఇండియా నౌకలకు చెల్లించాల్సిన అవసరం లేదని తెలిపింది. ఈ మేరకు భారత షిప్పింగ్ మంత్రిత్వ శాఖ ప్రత్యేక కార్యదర్శి రాజేష్ కుమార్ వెల్లడించారు. ఈ మార్గం ఇరుకుగా ఉన్న నేపథ్యంలో నౌకలు రావడం ఆలస్యం అవుతోందని ఆయన క్లారిటీ ఇచ్చారు.

92 వేల‌ టన్నుల గ్యాస్ తో రెండు నౌకలు అక్కడి నుంచి ఇప్పటికే బయలు దేరినట్లు వివరించారు. మరో 20 నౌకలు పర్షియన్ గల్ఫ్ లో ఉన్నట్లు వెల్లడించారు. ఇందులో ఐదు ఎల్పీజీ, నాలుగు క్రూడ్ ఆయిల్ ఓడలు ఉన్నాయని స్పష్టం చేశారు. అయితే ఇరాన్ అనుమతులు ఇచ్చినప్పటికీ కూడా ఇండియాకు సంబంధించిన నౌకలు రిటర్న్ రావడం లేదని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి. ఈ క్రమంలోనే షిప్పింగ్ మంత్రిత్వ శాఖ ప్రత్యేక కార్యదర్శి రాజేష్ కుమార్ క్లారిటీ ఇచ్చారు. హర్మూజ్ జలసంధి వద్ద ఇరుకుగా మార్గం ఉన్న నేపథ్యంలో ఈ ఆలస్యం జరుగుతోందని పేర్కొన్నారు.

Next Story