దుబాయ్ లో భారత సంతతి పారిశ్రామికవేత్త మృతి

by Naga Rani Yarlagadda |

దుబాయ్ లో రెడ్ బ్లూ బ్లర్ ఐడియాస్ (RBBi) సంస్థకు కో ఫౌండర్, అక్కడి డిజిటల్ డిజైన్ ..

దుబాయ్ లో భారత సంతతి పారిశ్రామికవేత్త మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: దుబాయ్ లో రెడ్ బ్లూ బ్లర్ ఐడియాస్ (RBBi) సంస్థకు కో ఫౌండర్, అక్కడి డిజిటల్ డిజైన్ రంగంలో తనదైన ముద్ర వేసిన భారత సంతతికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త దేవేశ్ మిస్త్రీ మరణించారు. సూపర్ మ్యాన్ గా సుపరిచితులైన ఆయన తయారు చేసిన యూజర్ ఫ్రెండ్లీ డిజైన్లు ప్రసిద్ధి చెందాయి. కాగా.. మిస్త్రీ మరణానికి గల కారణాలను కంపెనీ వెల్లడించలేదని గల్ఫ్ న్యూస్ పేర్కొంది.

దేవేశ్ మిస్త్రీ.. అమోల్ కదమ్ అనే వ్యాపారవేత్తతో 2011లో స్థాపించిన RBBi సంస్థ డిజిటల్ ఎక్స్ పీరియన్స్ పరిశ్రమను తీర్చిదిద్దడంలో కీలకపాత్ర పోషించింది. యూఏఈలో ఈ కంపెనీ తొలి స్పెషలైజ్డ్ యూఎక్స్, యూఐ ఏజెన్సీల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. కాగా.. దేవేశ్ మిస్త్రీ ముంబై యూనివర్సిటీలో ఫిజిక్స్ లో డిగ్రీ కంప్లీట్ చేశారు. ఆ తర్వాత కోడింగ్ లో పనిచేశారు. కొన్నాళ్లకు యూఎక్స్ ఇంపార్టెన్స్ తెలుసుకుని ఆ రంగంలో వ్యాపారం మొదలుపెట్టి రాణించారు. మైక్రోసాఫ్ట్, IBM, మాస్టర్ కార్డ్ వంటి ఇంటర్నేషనల్ బ్రాండ్స్ తో పనిచేశారు.

Next Story