Kerala : భారత నర్సుకు యెమెన్‌లో ఉరిశిక్ష

by Muthe.Rajitha |

ఈనెల 16న భారతదేశానికి చెందిన నర్సుకు యెమెన్‌(Yemen)లో ఉరిశిక్ష(Death Penalty) పడనుంది.

Kerala : భారత నర్సుకు యెమెన్‌లో ఉరిశిక్ష
X

దిశ, వెబ్ డెస్క్ : ఈనెల 16న భారతదేశానికి చెందిన నర్సుకు యెమెన్‌(Yemen)లో ఉరిశిక్ష(Death Penalty) పడనుంది. కేరళ(Kerala)లోని పాలక్కాడ్ జిల్లాకు చెందిన నర్సు నిమిషా ప్రియ(Nurse Nimisha Priya) యెమెన్‌లో 2017లో తలాల్ అబ్దో మెహదీని హత్య చేసిన కేసులో ఈ శిక్ష అమలు కానుంది. ఈ విషయాన్ని నిమిషా తల్లి ప్రీమా కుమారి యొక్క పవర్ ఆఫ్ అటార్నీ కలిగిన మానవ హక్కుల కార్యకర్త సామ్యూల్ జెరోమ్ బాస్కరన్ ధృవీకరించారు. నిమిషా 2008లో ఉద్యోగఅవకాశాల కోసం యెమెన్‌కు వెళ్లి, 2011లో తోమీ థామస్‌ను వివాహం చేసుకుని, సనా నగరంలో స్థిరపడ్డారు. యెమెన్ చట్టం ప్రకారం విదేశీయులు స్థానిక భాగస్వామి లేకుండా వ్యాపారం నిర్వహించలేరు కాబట్టి, 2015లో స్థానికుడైన తలాల్ అబ్దో మెహదీతో కలిసి క్లినిక్ ప్రారంభించారు.

అనంతరం తలాల్ ఆమె పాస్‌పోర్టు లాక్కొని, ఆర్థికంగా, శారీరకంగా, మానసికంగా వేధించగా.. ఎలాగైనా పాస్‌పోర్టు తిరిగి తీసుకునేందుకు అతనికి మత్తు ఇంజక్షన్ ఇచ్చింది. అది ఓవర్‌డోస్‌ కావడం వల్ల అతడు మరణించాడు. దీంతో భయపడిన నిమిషా, ఒక యెమెనీ సహాయకురాలితో కలిసి శవాన్ని ముక్కలు చేసి నీటి ట్యాంకులో పడేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో యెమెన్ కోర్టు 2020లో ఆమెకు మరణశిక్ష విధించగా.. 2023లో అక్కడి సుప్రీంకోర్టు ఈ తీర్పును సమర్థించింది. సేవ్ నిమిషా ప్రియా ఇంటర్నేషనల్ యాక్షన్ కౌన్సిల్ షరియా చట్టం కింద "బ్లడ్ మనీ"(దియా) చెల్లించి క్షమాభిక్ష పొందేందుకు రూ. 8.5 కోట్లు తలాల్ కుటుంబానికి ఇచ్చేందుకు ప్రతిపాదించినప్పటికీ.. వారి నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఈ వ్యవహారంలో భారత ప్రభుత్వం దౌత్యపరమైన సహాయం అందిస్తున్నప్పటికీ.. యెమెన్ చట్టాల ప్రకారం ఈనెల 16న ఉరిశిక్ష అమలు కానుంది. అయితే చివరి నిమిషంలోనైనా క్షమాభిక్ష కోసం ఇంకా చర్చలు జరుగుతున్నాయి.

Next Story