- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > దేశం-విదేశం > ప్రపంచం > ఇరాన్‌కు వెళ్లొద్దు.. వెంటనే దేశం విడిచిపెట్టండి: ‘ఇండియన్ ఎంబసీ’ అత్యవసర హెచ్చరిక!
ఇరాన్‌కు వెళ్లొద్దు.. వెంటనే దేశం విడిచిపెట్టండి: ‘ఇండియన్ ఎంబసీ’ అత్యవసర హెచ్చరిక!
by Malleboina Mahesh |
ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాన్‌కు ప్రయాణాలను నిలిపివేయాలని భారత రాయబార కార్యాలయం పౌరులను కోరింది. ప్రస్తుతం ఇరాన్‌లో ఉన్న భారతీయులు వెంటనే దేశం విడిచి రావాలని అత్యవసర అడ్వైజరీ జారీ చేసింది.

X
దిశ, వెబ్ డెస్క్: ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు చేస్తుండటంతో మళ్లీ యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో అప్రమత్తమైన ఇండియన్ ఎంబసీ.. తాజా పరిస్థితుల్లో ఇరాన్ కు ఎవరూ వెళ్లొద్దని అత్యవసర హెచ్చరికలు జారీ చేసింది. ప్రాంతీయంగా నెలకొన్న తాజా పరిణామాలను పరిగణనలోకి తీసుకుని ప్రస్తుతం ఇరాన్‌లో నివసిస్తున్న, వివిధ పనుల నిమిత్తం అక్కడ ఉన్న భారతీయులందరూ తక్షణమే అందుబాటులో ఉన్న విమాన, భూ రవాణా మార్గాల ద్వారా దేశాన్ని విడిచిపెట్టాలని సూచించింది. సామాజిక మాధ్యమం 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా ఈ అధికారిక ప్రకటనను విడుదల చేస్తూ, పౌరులంతా అత్యంత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.
Next Story






