ఇరాన్‌లోని భారతీయులకు ఎంబసీ అలర్ట్.. రానున్న 48 గంటలు ఎక్కడికక్కడ ఉండిపోవాలని ఆదేశం

by Ramesh Naini |

ఇరాన్‌లో ఉన్న భారతీయ పౌరులకు టెహ్రాన్‌లోని భారత రాయబార కార్యాలయం (ఇండియన్ ఎంబసీ) మంగళవారం (ఏప్రిల్ 7) అత్యవసర అడ్వైజరీని జారీ చేసింది.

ఇరాన్‌లోని భారతీయులకు ఎంబసీ అలర్ట్.. రానున్న 48 గంటలు ఎక్కడికక్కడ ఉండిపోవాలని ఆదేశం
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఇరాన్‌లో ఉన్న భారతీయ పౌరులకు టెహ్రాన్‌లోని భారత రాయబార కార్యాలయం (ఇండియన్ ఎంబసీ) మంగళవారం (ఏప్రిల్ 7) అత్యవసర అడ్వైజరీని జారీ చేసింది. రానున్న 48 గంటల పాటు భారతీయులంతా అప్రమత్తంగా ఉండాలని, ఎవరూ బయటకు రావొద్దని, ఉన్న చోటే సురక్షితంగా ఉండాలని స్పష్టం చేసింది.

ప్రయాణాలపై ఆంక్షలు

ఇరాన్‌లో ఉన్న భారతీయులు రానున్న 48 గంటల పాటు ఇళ్లకే పరిమితం కావాలి. విద్యుత్ కేంద్రాలు, సైనిక స్థావరాలకు అత్యంత దూరంగా ఉండాలి. బహుళ అంతస్తుల భవనాల్లో (అపార్ట్‌మెంట్లు) పై అంతస్తుల్లో ఉండొద్దని, కింది ఫ్లోర్లలోనే సురక్షితంగా ఉండాలని ఎంబసీ సూచించింది. జాతీయ రహదారులపై (హైవేలు) ప్రయాణాలను పూర్తిగా నివారించాలి. ఒకవేళ ప్రయాణించక తప్పని పరిస్థితులు ఉంటే, తప్పనిసరిగా ఎంబసీ అధికారులతో ముందుగా సమన్వయం చేసుకోవాలని స్పష్టం చేసింది.

ఎంబసీ హోటళ్లలో ఉన్నవారికి

ఎంబసీ ద్వారా ఏర్పాటు చేసిన హోటళ్లలో బస చేస్తున్న వారు ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు రావొద్దని, అక్కడి ఎంబసీ బృందాలతో నిరంతరం టచ్‌లో ఉండాలని కోరింది. అధికారిక సమాచారం, తాజా అప్‌డేట్స్ కోసం ఎంబసీ ప్రకటనలను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలని సూచించింది.

అత్యవసర హెల్ప్‌లైన్ నంబర్లు..

భారతీయుల భద్రత దృష్ట్యా ఎంబసీ అత్యవసర సేవలు నిరంతరం అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు. ఏదైనా అత్యవసర సాయం కోసం కింది నంబర్లను సంప్రదించవచ్చని వెల్లడించారు.

మొబైల్ నంబర్లు: +989128109115

+989128109109

+989128109102

+989932179359

ఈ-మెయిల్: [email protected].in

Next Story