- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
లండన్‌లో పాకిస్థాన్ కు చుక్కలు చూపిస్తున్న ఇండియన్స్
పాకిస్తాన్ కు ( Pakisthan) అడుగడుగునా ఇండియా చుక్కలు చూపిస్తోంది. జమ్మూ కాశ్మీర్ లోని పహాల్గామ్ లో ( Pahalgam Terror

దిశ, వెబ్ డెస్క్: పాకిస్తాన్ కు ( Pakisthan) అడుగడుగునా ఇండియా చుక్కలు చూపిస్తోంది. జమ్మూ కాశ్మీర్ లోని పహాల్గామ్ లో ( Pahalgam Terror Attack ) ఉగ్రవాదులు చేసిన దారుణానికి.... ఇండియా పగ తీర్చుకుంటుంది. ఇందులో భాగంగానే ఇప్పటికే సింధు జలాలను నిలిపివేసింది ఇండియా. దీంతో పాకిస్తాన్ త్వరలోనే ఎడారి కాబోతుందని చెబుతున్నారు. అయితే.. పహాల్గామ్ లో ఉగ్రవాదులు చేసిన దారుణానికి నిరసనగా... లండన్ లో కూడా ఇండియన్స్ ఒకే తాటి పైకి వచ్చారు.
లండన్ లో ( London) ఉన్న పాకిస్తాన్ రాయబార కార్యాలయం బయట భారతీయులందరూ కలిసి నిరసన తెలిపారు. పాకిస్తాన్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు కూడా చేశారు. కొంత మంది జైహింద్, జైశ్రీరామ్ నినాదాలు కూడా చేశారు. పాకిస్తాన్ ఉగ్రవాద దారుణాలను... ప్రపంచ దేశాలకు తెలియజేసేలా... ఇలా లండన్ లో నిరసన తెలిపారు ఇండియన్స్. దీంతో పాకిస్తాన్ రాయబార కార్యాలయంలో ఉన్న సెక్యూరిటీ సిబ్బంది.. ఇండియన్స్ ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.
దీనికి సంబంధించిన వీడియో అలాగే ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. వీటిని చూసిన ఇండియన్స్... నిరసన తెలిపిన భారతీయులను మెచ్చుకుంటున్నారు. లండన్ లో కూడా పాకిస్తాన్ కు ఇండియన్స్ చుక్కలు చూపిస్తున్నారని కామెంట్స్ చేస్తున్నారు. ఇలా అందరూ ఏకమై... పాకిస్తాన్ ను భూస్థాపితం చేయాలంటూ... నినాదిస్తున్నారు. ఇది... ఇలా ఉండగా జమ్మూ కాశ్మీర్ లోని పహాల్గామ్ ప్రాంతంలో పాకిస్తాన్ ఉగ్రవాదులు దారుణానికి ఒడిగట్టిన సంగతి తెలిసిందే. ఏకంగా 28 మంది యాత్రికులను అన్యాయంగా చంపేశారు. దొంగ చాటున వచ్చి... ఇండియన్స్ ను కాల్చేశారు.






